ఆ దేశంలో ‘అఖండ’ సంచలన రికార్డ్: ప్రపంచంలోనే పెద్ద థియేటర్‌లో బాలయ్య హవా

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం సంపాదించుకున్నారు. అదే సమయంలో తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించుకున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలయ్య.. తన ప్రతి సినిమానూ అన్ని ప్రాంతాల్లో విడుదలయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'అఖండ'తో మరో దేశంలోనూ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

‘అఖండ' రాబోతున్న బాలకృష్ణ

‘అఖండ' రాబోతున్న బాలకృష్ణ

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌ నందమూరి బాలకృష్ణ.. బడా దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న చిత్రమే 'అఖండ'. రెండు భారీ హిట్ల తర్వాత వస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర

కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర

విజయం కోసం పరితపిస్తోన్న బాలయ్య.. 'అఖండ' మూవీ కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న స్టార్‌గా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా దీన్ని ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు.

అంచనాలు పెంచి.. రికార్డులు కొట్టి

అంచనాలు పెంచి.. రికార్డులు కొట్టి

'అఖండ' మూవీ నుంచి ఏది విడుదలైన సెన్సేషన్ అవుతోంది. గతంలో వచ్చిన ఫస్ట్ టీజర్‌తో పాటు టైటిల్ రోర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తద్వారా సౌతిండియా రికార్డు బాలయ్య సొంతమైంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది.

బాలయ్య కెరీర్‌లోనే రెండో మొత్తం

బాలయ్య కెరీర్‌లోనే రెండో మొత్తం

'అఖండ' మూవీని అనౌన్స్ చేసిన సమయంలో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు ఉత్సాహం చూపారు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ అని టాక్.

విడుదల ముందు అన్నీ పూర్తి చేసి

విడుదల ముందు అన్నీ పూర్తి చేసి

రిలీజ్‌కు టైం దగ్గర పడడంతో 'అఖండ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే ఈ చిత్రం సెన్సార్ బోర్డుకు వెళ్లింది. అక్కడ ఈ సినిమాను చూసిన మెంబర్లు దీనికి U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారట. అంటే అన్ని వర్గాల వాళ్లకూ చేరువయ్యే సినిమా అయింది. ఇక, ఈ సినిమా రన్ టైమ్ 2:45 గంటలు అని తెలుస్తోంది.

గ్రాండ్‌ రిలీజ్... అక్కడ భారీ రేంజ్

గ్రాండ్‌ రిలీజ్... అక్కడ భారీ రేంజ్

దాదాపు రూ. 50 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకోవడంతో క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ' సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 1వ తేదీ రాత్రి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే పెద్దదైన మెల్‌బోర్న్‌లోని ఐమాక్స్‌లోనూ స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
ఆ దేశంలో బాలయ్య నయా రికార్డ్

ఆ దేశంలో బాలయ్య నయా రికార్డ్

తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలోనూ బాలయ్య సినిమాలకు మంచి స్పందన వస్తూ ఉంటుంది. అందుకే మెల్‌బోర్న్‌లోని ఐమాక్స్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇక, ఈ షోకు సంబంధించిన బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా.. గంటల్లోనే అవన్నీ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో వేగంగా హౌస్‌ఫుల్ అయిన తెలుగు సినిమాగా 'అఖండ' రికార్డును నమోదు చేసిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X