Akhil: చిరంజీవి బాలయ్యను వెనక్కి నెట్టిన అఖిల్.. అందులో అయ్యగారే నెంబర్ వన్!
సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంతో కాస్తా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు తర్వలో ఏజెంట్ గా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో తెలుగు చిత్రసీమలోనే స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణను వెనక్కి నెట్టేశాడు ఈ యంగ్ హీరో.
తమిళ దర్శకుడితో : బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

హాలీవుడ్ తరహాలో : ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ విపరీతంగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్స్ సీన్స్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు అఖిల్. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ తరహాలో తెరకెక్కించిన ఏజెంట్ మూవీపై అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
అదిరేలా యాక్షన్ : ఇటీవల ఏజెంట్ ట్రైలర్ లాంచ్ కోసం 172 ఫీట్ల భవనంపై నుంచి దూకి ఎవరూ చేయలేని సాహసం చేసి చూపించాడు అఖిల్. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 18న విడుదల చేశారు. ఈ ట్రైలర్ అక్కినేని అభిమానులనేకకాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో సరికొత్త హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో మరి వైల్డ్ గా కనిపించాడు. యాక్షన్ సీన్సులో అదరగొట్టేశాడు.
యూట్యూబ్ షేక్ : ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ 1.3 కోట్ల వ్యూస్ తోపాటు 2.2 లక్షల లైక్స్ తో సత్తా చాటుతోంది. అయితే ట్రైలర్ వ్యూస్ విషయంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలను వెనక్కినెట్టేసింది అఖిల్ ఏజెంట్ మూవీ.

సరికొత్త రికార్డ్..: ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో వాల్తేరు వీరయ్య సినిమాకు 11.5 మిలియన్ ప్లస్ వ్యూస్ రాగా, బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రానికి 8 మిలియిన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇక అఖిల్ ఏజెంట్ మూవీకి 24 గంటల్లో 12 మిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్ సాధించింది. ఇలా ఈ రికార్డుతో చిరంజీవి, బాలయ్య బాబను యంగ్ హీరో అక్కినేని అఖిల్ వెనక్కి నెట్టేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో అయ్యగారే నెంబర్ వన్ అంటూ ఫ్యాన్స్ యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











