Agent: మళ్ళీ పెరుగుతున్న అఖిల్ ఏజెంట్ బడ్జెట్.. మొత్తం ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలి అని అఖిల్ అక్కినేని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో మిస్ అవ్వకూడదు అనే విధంగా అతను బాక్సాఫీస్ పై టార్గెట్ అయితే గట్టిగానే సెట్ చేసుకుంటున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏజెంట్ సినిమాలో అఖిల్ ఒక పవర్ఫుల్ స్పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో అతను చాలా ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు అని ఇదివరకే విడుదల చేసిన టీజర్స్ పోస్టర్స్ ద్వారా అర్థమయింది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఫిట్నెస్ లో మార్పులు తీసుకొచ్చాడు. అయితే ఏజెంట్ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా చాలా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Akhil akkineni agent movie budget news viral once again hike

అసలైతే మొదట ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఒక 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఫినిష్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను నిర్మిస్తూ ఉండడంతో ఆ సంఖ్య మళ్ళీ 60 కోట్లు దాటింది. అంతేకాకుండా మధ్యలో ఒక యాక్షన్స్ సీన్స్ షూట్ చేసిన తర్వాత సరిగ్గా రాలేదు అని మళ్లీ ఆ ఎపిసోడ్ ను రీషు చేయడం జరిగింది.

ఇక ఇప్పుడు యాక్షన్ కు సంబంధించిన షూటింగ్ కాస్ట్ మరింత పెరిగిపోతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు బడ్జెట్ మళ్ళీ మూడవసారి పెరిగిపోవడంతో దాదాపు 80 నుంచి 90 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఒక విధంగా అఖిల్ పై ఈ స్థాయిలో ఎన్నడూ కూడా బడ్జెట్ పెట్టింది లేదు. అతని సినిమాలో మొదటి సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెరగడంతో ఊహించిన విధంగా నష్టాలు వచ్చాయి. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్ కాంబినేషన్ ను నమ్మి నిర్మాత రామ్ బ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: akhil akkineni agent
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X