Akhil Bulk Body: హాలీవుడ్ హీరోలా అక్కినేని అఖిల్.. గుర్తు పట్టని విధంగా మారిపోయి షాకిచ్చాడుగా!
'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీని తర్వాత అతడు 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలను సైతం చేశాడు. కానీ, ఇవేమీ అఖిల్‌కు విజయాన్ని మాత్రం అందించలేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక, ఇప్పుడు అఖిల్ 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం అతడు కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ బల్క్ బాడీ ఫొటో బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

బ్యాచ్‌లర్‌గా హిట్ కొట్టేసిన అఖిల్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఏజెంట్‌గా మారిన అక్కినేని హీరో
'బ్యాచ్‌లర్' రిలీజ్ కాకముందే అఖిల్.. సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ పెట్టారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ థను అందిస్తున్న విషయం తెలిసిందే.

అలాంటి పాత్రలో అఖిల్.. పోస్టర్
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఏజెంట్'లో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్ విషయంలోనూ వైవిధ్యంగా తయారయ్యాడు. ఇక, ఇటీవలే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. వీటిలో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు.

విదేశాల్లోనే షూట్.. ఇప్పుడు బ్రేక్
యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో హీరోపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. ఈ క్రమంలోనే మిగిలిన షూట్ కోసం చిత్ర యూనిట్ విదేశీ పర్యటకు వెళ్లనుంది. ఎప్పుడో పయనం అవ్వాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల ఈ షెడ్యూల్ వాయిదా పడుతోంది. దీంతో షూట్‌కు బ్రేక్ పడింది.

హాలీవుడ్ హీరోలా మారిన అఖిల్
అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీ కోసం ఎంతగానో కష్టపడుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నాడు. అందుకోసం చాలా కాలంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో కూడా కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హాలీవుడ్ హీరోలా మారిపోయిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు.

గుర్తు పట్టని విధంగా ఉన్న ఫొటో
తాజాగా అక్కినేని అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కండలు తిరిగిన దేహంతో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేశాడు. దీనికి '2022లో ఒక తుఫాను రాబోతుంది. దాన్ని నేను ఫీల్ అవుతున్నాను' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక, ఇందులో అతడు జుట్టు ముడిపెట్టుకుని, తల కిందకు దించి కూర్చున్నాడు. దీంతో అతడు గుర్తు పట్టని విధంగా ఉన్నాడు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











