CCL2023: బ్యాటింగ్ తో అఖిల్ ఊచకోత.. ఆ కొట్టుడుకు కూర్చున్న నాన్ స్ట్రైకర్.. థమన్ ఆల్ రౌండర్ షో!
సినిమా తారలు క్రికెట్ ఆడితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక గత కొన్ని ఏళ్ళుగా సిసిఎల్ సినిమా సినిమా స్టార్స్ నిర్వహిస్తున్న మ్యాచ్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈసారి కూడా గ్రాండ్ గా సిసిఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి. అయితే ఆదివారం రోజు జరిగిన కేరళ స్ట్రైకర్స్ తెలుగు వారియర్స్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో అఖిల్ అక్కినేని బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక తమన్ కూడా ఆల్రౌండర్ ప్రతిభతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

10 ఓవర్లలో 170 పరుగులు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో భాగంగా ఆదివారం రోజు కేరళ స్ట్రైకర్స్ తెలుగు వారియర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో మొత్తంగా 170 పరుగులు చేసింది. మొదటినుంచి తెలుగు వారియర్స్ బ్యాట్స్ మెన్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగులను తీశారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రతి ఓవర్లో బౌండరీలు బాదారు.

అఖిల్ ఊచకోత
ముఖ్యంగా అఖిల్ అక్కినేని అయితే మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన అనేక రకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా అఖిల్ అక్కినేని ఈ ఇన్నింగ్స్ లో 31 బంతుల్లో 90 పరుగులు చేశాడు కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయింది. తప్పకుండా అఖిల్ సెంచరీ కొడతాడని అనుకున్నారు కానీ ఊహించని విధంగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మొదట్లో నెమ్మదిగా..
అఖిల్ బ్యాటింగ్ చూసి ప్రత్యర్థి బౌలర్లు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఎదుర్కొన్న ప్రతి బంతిని కూడా అతను బౌండరీకి బాధేలా చూసాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన అఖిల్ ఆ తర్వాత ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. మొదట 50 పరుగులను 15 బంతుల్లో కొట్టేయడం విశేషం.

నాన్ స్ట్రైకర్ సిట్టింగ్
ఇక అఖిల్ కొడుతూ ఉంటే నాన్ స్ట్రైకర్ గా ఉన్న సుధీర్ బాబు ఏమి చేయలేని పరిస్థితుల్లో అలానే కూర్చుండి పోయాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిల్ బ్యాటింగ్ కు అందరు కూడా ఫిదా అయ్యారు అయ్యగారు నెంబర్ వన్ అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
థమన్ ఆల్ రౌండర్ షో
ఇక థమన్ కూడా ఊహించిన విధంగా బ్యాటింగ్ తోనే కాకుండా బౌలింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. థమన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి సీసీఎల్ లో అతను మొదటి సారి క్రికెట్ ఆడుతున్నాడు. ఇక తమన్ 12 బంతుల్లో 21 పరుగులు చేయగా బౌలింగ్లో కూడా ఆకట్టుకున్నాడు. 13 పరుగులు ఇచ్చి థమన్ మూడు వికెట్లు తీశాడు.

తెలుగు వారియర్స్ విజయం
మొత్తంగా తెలుగు వారియర్స్ అయితే 10 ఓవర్లలో 170 పరుగులు చేసి. ఇక 171 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన కేరళ స్ట్రైకర్స్ తెలుగు వారియర్స్ బౌలింగ్ దాటికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తెలుగు వారియర్స్ 65 అడుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇక 91 పరుగులు చేసిన అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక విక్టరీ వెంకటేష్ తెలుగు ప్లేయర్స్ కు సపోర్ట్ చేస్తూ కనిపించారు.


Click it and Unblock the Notifications











