కండలు పెంచి హెయిర్ స్టైల్ కూడా మార్చేసిన అఖిల్.. ఇన్నాళ్ళకు అయ్యగారికి సరైనోడు దొరికాడు
అక్కినేని యువ హీరో అఖిల్ బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎంతగా కష్టపడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా మూడు డిఫరెంట్ సినిమాలతో వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మాత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. ఇంతవరకు బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. కానీ ఆ తరువాత సినిమాపై మాత్రం బజ్ క్రియేట్ అవుతోంది.

ముందుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ డిఫరెంట్ లవ్ స్టొరీ ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం. అయితే ఆ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబో పై మాత్రం అక్కినేని ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి

నెవర్ బిఫోర్ అనేలా
మొదటి సినిమా అఖిల్ తరువాత ఇంతవరకు ఈ అక్కినేని వారసుడు ఫుల్ యాక్షన్ మోడ్ లోకి రాలేదు. ఇక సురేంధర్ సినిమాతో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడని తెలుస్తోంది. కిక్ రేసుగుర్రం వంటి సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా సినిమాతో కూడా పర్వలేదనిపించాడు. కానీ ఆ పాన్ ఇండియా సినిమా అనుకున్నంత స్థాయిలో అంచనాలను అందుకోలేదు.

స్పై క్యారెక్టర్ లో అఖిల్
ఇక అఖిల్ తో చేయబోయే సినిమా మాత్రం తన రెగ్యులర్ యాక్షన్ సినిమాల మాదిరిగానే ఉంటూ ఒక డిఫరెంట్ ఫీల్ ను కలిగిస్తుందట. సినిమాలో అఖిల్ ఒక స్పై క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే ఆ పాత్ర కోసం అఖిల్ తన స్టైల్ ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా కాకుండా ఎదో కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

ఇన్నాళ్లకు సరైన దర్శకుడు దొరికాడు
ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఫొటో పోస్ట్ చేసిన అఖిల్ అందులో తన లుక్ ను మొత్తం చేంజ్ చేసినట్లు అర్ధమవుతోంది. బాడీ కూడా గట్టిగానే పెంచేశాడు. ఇక హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేశాడు. చూస్తుంటే ఇన్నాళ్లకు అఖిల్ ఒక సరైన దర్శకుడి చేతిలో పడ్డట్లు అర్ధమవుతోంది. గత సినిమాలు చాలా రొటీన్ లుక్స్ ఉండడం వలన అఖిల్ పెద్దగా క్రేజ్ అందుకోలేదు. ఇక ఇప్పుడు లుక్ పరంగా అఖిల్ క్లిక్కయ్యేలా ఉన్నాడని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











