నాలో ఎంతో మార్పు రాబోతోంది.. దుమ్ములేపుతోన్న అఖిల్
అక్కినేని అఖిల్.. విజయం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఏవీ కూడా అఖిల్‌కు సక్సెస్‌ను అందించలేకపోయి. తండ్రి నాగ్ మద్దతు ఉన్నా కూడా సినిమాలేవీ వర్కౌట్ కావడం లేదు. విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి వంటి వారు కూడా అఖిల్‌కు విజయాన్ని కట్టబెట్టలేకపోయారు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో వస్తున్నాడు.
బొమ్మరిల్లు సక్సెస్ కొట్టిన భాస్కర్.. అఖిల్‌ను మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా చూపించబోతోన్నాడు. అయితే ఈ సినిమా ఈ ఇద్దరికీ సవాల్ వంటిదే. అసలే రాక రాక వచ్చిన అవకాశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ఉపయోగించుకుని సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. మామూలుగా అయితే ఈ పాటికే అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా కారణంగా అంతా తారుమారైంది.

ఇటీవలె విడుదల చేసిన ఓ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే తన కాళ్లను అఖిల్‌పై వేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజాగా అఖిల్ తనలోని కొత్త యాంగిల్‌ను చూపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు జిమ్‌లో తెగ కష్టపడి బాడీని పెంచేస్తున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ పోస్ట్ చేస్తూ.. 'ఇక నా ఆట, ఇంటెన్సిటీ, హార్డ్ వర్క్‌ను మరో లెవెల్‌కు తీసుకురావాల్సిన సమయం వచ్చింది.. నాలో ఉన్న ఇంటెన్సిటీ, హార్డ్ వర్క్.. నా జీవితంలో కొత్త దశ ప్రారంభం అయింది.. నాలో వచ్చిన ఈ మార్పే నా జీవితంలో అన్నింటి కంటే ప్రత్యేకమైంది. ఇది నా జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతోంది. ఇంకా ఎన్నెన్నో రాబోతోన్నాయి' అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











