ఆ స్టార్ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ ఆమెనే..:అఖిల్ అక్కినేని

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నటవారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే.. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన నటించినా .. ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించలేదు. మధ్యలో ఓ సినిమా పర్వాలేదని అనిపించినా ఆ క్రెడిట్ హీరోయిన్ ఖాతాలో పడిపోయింది. ఎంతో కష్టపడ్డ ఆయనకు తగిన గుర్తింపు మాత్రం ఇంకా దక్కలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు తన ఆరో సినిమా 'లెనిన్' పై అఖిల్‌తో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొంది.

'ఏజెంట్' సినిమా ఘోర పరాజయం తర్వాత అఖిల్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఈసారి ఎలాంటి తొందరపడకుండా మంచి కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన 'లెనిన్' సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Akhil Akkineni Reveals His First Crush Deepika Padukone During Lenin Promotions

అఖిల్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "మీ క్రష్ ఎవరు?" అని అడగగా.. మొదట అఖిల్ ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు. "ప్రస్తుతం అలాంటి క్రష్ ఎవరూ లేరు. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదు" అని చెప్పారు. అయితే యాంకర్ అక్కడితో ఆగకుండా, "టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్... ఎవరూ లేరా? చిన్నప్పటి నుంచి కూడా ఎవరూ నచ్చలేదా?" అంటూ మళ్లీ ప్రశ్నించింది. కొద్దిసేపు నవ్విన అఖిల్ చివరకు తన మనసులోని విషయాన్ని బయటపెట్టారు. యాంకర్ వరుస ప్రశ్నలతో పట్టుబడటంతో అఖిల్ నవ్వుతూ.. "చిన్నప్పటి నుంచి అంటే.. దీపికా పదుకొనే అంటే నాకు చాలా ఇష్టం. ఆమెనే నా ఫస్ట్ క్రష్"అని చెప్పేశారు.

అఖిల్ సమాధానం విన్న యాంకర్ కూడా ఆశ్చర్యపోయింది. "అందరూ దీపికా పదుకొనే పేరే చెబుతున్నారు. మీ దగ్గర నుంచి ఇంకెవరి పేరు వస్తుందనుకున్నా" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. దానికి అఖిల్ కూడా నవ్వుతూ రిప్లే ఇచ్చారు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'లెనిన్'పై భారీ అంచనాలు
ఇదిలా ఉంటే, 'లెనిన్' సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ తర్వాత అఖిల్‌కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన కథగా కనిపించడం సినిమాకు ప్లస్‌గా మారింది.'లెనిన్' విడుదల తర్వాత అఖిల్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ విజయం దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X