దర్శక నిర్మాతలకు అడ్డుపడిన అఖిల్.. ఎంతగా ఎదిగిపోయాడో..
ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటుంది. సినిమా ఎలా ఉన్నా జనాల్లోకి వెళ్లాలంటే ముందు ప్రమోషన్స్ బావుండాలి. అందుకే స్పెషల్ డేట్స్ ని టార్గెట్ చేస్తూ రకరాలుగా ఫస్ట్ లుక్ టీజర్స్ అంటూ సందడి చేస్తుంటారు. ఇక స్టార్స్ బర్త్ డే వస్తే.. ఆ రోజు ఫ్యాన్స్ కోసమైనా ఎదో ఒక స్పెషల్ అప్డేట్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణంగా ఇతర టెక్నీషియన్ల కారణంగా సినిమా టీజర్స్, అప్డేట్స్ అనుకున్న సమయానికి రాకపోవచ్చు. ఈ విషయంలో హీరోలే ముందుండి ఆడియెన్స్ కి చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అఖిల్ మాత్రం తన సినిమా విషయంలో ఎవరు ఊహించని విధంగా ఏ లుక్కు రిలీజ్ కావడానికి వీల్లేదని దర్శకనిర్మాతలకి అడ్డుపడ్డాడట.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పార్టీలు ఏవి ఉండకూడదని అఖిల్ అభిమానులకు వీడియో ద్వారా తెలియజేశాడు.
దానికి కారణం కరోనా.. ఇలాంటి బాధాకరమైన సమయంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్ చెప్పడం ఆడియెన్స్ ని ఆలోచింప జేసింది. అయితే వేరేవాళ్ళు మాత్రం ఆడియెన్స్ కి ఇలాంటి సమయంలో ఎదో ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చి ఆనందానికి గురి చేయాలని మరొక విధంగా ఆలోచిస్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం వేరే విధంగా ఆలోచించడంతో సిసింద్రీ చాలా ఎదిగిపోయాడు అంటూ పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











