Akhil Agent విడుదల తేది ఫిక్స్.. సమ్మర్ స్పెషల్ గా.. ఆ రోజు నుంచి అఖిల్ యాక్షన్ స్టార్ట్!

సిసీంద్రి సినిమాతో చిన్నప్పుడే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. టాలీవుడ్ కింగ్​, మన్మథుడు అక్కినేని నాగార్జున- అమల ముద్దుల తనయుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అఖిల్. మనం సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి.. అఖిల్​ మూవీతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే మోస్ట్ ఎలిజబుల్​ బ్యాచ్​లర్ మూవీతో కొద్దిగా హిట్ ట్రాక్​లో పడిన అఖిల్​ ఒక సాలిడ్ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఏజెంట్​ అనే స్పై యాక్షన్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు అఖిల్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఇదే అని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

చివరి సారిగా..

చివరి సారిగా..

అక్కినేని నాగార్జున, శరత్ కుమార్, అమల నటించిన సూపర్ హిట్ చిత్రం సిసీంద్రిలో బాబుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అఖిల్. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చాయి.

కానీ 2021లో చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్​ బ్యాచ్​లర్​ సినిమాతో మొదటిసారిగా హిట్​ ట్రాక్​లో పడ్డాడు. కానీ అఖిల్ కు మాత్రం అంతగా ఒరిగింది ఏం లేకుండా పోయింది. ఇక ఈ చిత్రంలో అఖిల్​ సరసన హీరోయిన్​గా బుట్టబొమ్మ పూజా హెగ్డేతోపాటు పలువురు హీరోయిన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సిక్స్ ప్యాక్ తో అఖిల్..

సిక్స్ ప్యాక్ తో అఖిల్..

ఎలాగైన తన కెరీర్ లో గుర్తుంచుకునే సూపర్ హిట్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈసారి ఎలాగైన తిరుగులేని హిట్ కొట్టాలని తెగ కష్టపడిపోతున్నాడు. అందులో భాగంగానే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్​గా రానున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీని బాగా కష్టపెట్టినట్లు సమాచారం. ఇందులో సిక్స్ ప్యాక్ తో అలరించనున్నాడు అఖిల్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు అఖిల్. ముఖ్యంగా మమ్ముట్టి చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

సమ్మర్ స్పెషల్ గా..

సమ్మర్ స్పెషల్ గా..

యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వేసవి స్పెషల్ గా ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారట. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏజెంట్ ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ రిలీజ్ డేట్ పై అధికారికంగా త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్యూటిఫుల్ సాక్షి వైద్య హీరోయిన్ గా చేస్తోంది. అఖిల్ అత్యంత ప్రమాదకర దేశభక్తుడి పాత్ర పోషిస్తున్న ఈ మూవీ హాలీవుడ్ హిట్ సిరీస్ 'ది బోర్న్ ఐడెంటిటీ'కి రీమేక్ వెర్షన్ అని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X