అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: మరోసారి ఆ డైరెక్టర్‌తోనే అఖిల్ సినిమా

చాలా చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాలో టైటిల్ రోల్ చేసి ప్రేక్షకులు అందరి నోటా ఔరా అనిపించాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇది వచ్చిన చాలా ఏళ్లకు 'అఖిల్' అనే సినిమాతో అతడు హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఇది మాత్రం డిజాస్టర్ అవడంతో అతడికి గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. దీని తర్వాత అతడు 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఇవేమీ ఈ యంగ్ హీరోకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌లర్' అనే సినిమా చేశాడు. ఇది మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అఖిల్ తొలిసారి సక్సెస్ బాట పట్టాడు.

వరుస పరాజయాలతో సతమతం అయినా.. అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ మాత్రం ఎన్నో ఆశల నడుమ భారీ స్థాయిలో విడుదలైంది. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఉత్సాహంతోనే ఈ యంగ్ హీరో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో కూడా పెట్టుకున్నాడు. ఇప్పటికే కొందరు దర్శకులను కూడా అతడు ఓకే చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

Tollywood Young Hero Akhil Akkineni Now Doing Agent Movie Under Surender Reddy Direction. After This Movie Akhil to Do Movie With Bhaskar.

అక్కినేని అఖిల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో యమ స్పీడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగానే అతడు తాజాగా ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. అఖిల్‌ కెరీర్‌లోనే మొట్టమొదటి విజయాన్ని అందించిన బొమ్మరిల్లు భాస్కర్ అని తెలిసింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్' చేస్తున్న సమయంలోనే అఖిల్‌కు ఈ దర్శకుడు ఓ లైన్‌ను వినిపించాడట. దీనికి ఎంతగానో ఇంప్రెస్ అయిన అక్కినేని హీరో.. పూర్తి స్థాయి కథతో రావాలని చెప్పాడట. దీంతో భాస్కర్ ఇటీవలే అతడిని మొత్తం కథను వినిపించాడని తెలుస్తోంది. ఇది విన్న వెంటనే సినిమా చేయడానికి అతడు అంగీకారం తెలియజేశాడని సమాచారం.

గతంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీతో వచ్చిన అఖిల్, భాస్కర్.. ఈ సారి మాత్రం పూర్తి స్థాయి విభిన్నమైన కథతో రావాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం గతంలో ఎన్నడూ టచ్ చేయని ఓ కొత్త కంటెంట్‌తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయని కూడా ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రకటనను అతి త్వరలోనే వదలబోతున్నారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్కినేని అఖిల్.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యాన్ని చూపించేందుకు బల్క్ బాడీతో తయారయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X