ఆ హీరోయిన్ వల్ల అఖిల్ ఆగిపోవాల్సి వచ్చిందట.. బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్
అక్కినేని మూడో తరం హీరో అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఈ సారి చేయబోయే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇందులో భాగంగానే అఖిల్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అఖిల్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వాస్తవానికి అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుందన్న విషయం కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ఆమె కోసం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిందట. ప్రస్తుతం పూజ.. వరుణ్ తేజ్ నటిస్తున్న 'వాల్మీకి', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాల్లో నటిస్తోంది. వీటి షూటింగ్ పూర్తయిన వెంటనే అఖిల్ సినిమాపై దృష్టి సారించనుంది.
ఈ కారణంగానే అఖిల్ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ కూడా ఫ్యామిలీతో కలిసి హాలిడేను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక, పూజా హెగ్డే వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా నాలో, శంభో శివ శంబో, జెండాపై కపిరాజు సినిమాలను డైరెక్ట్ చేసిన సముద్రఖని.. అఖిల్ తండ్రిగా నటించబోతున్నారని గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











