తాత నీ పేరు నిలబెట్టేందుకు ప్రతి రోజూ.. ఏఎన్నార్ బర్త్ డే సందర్భంగా అఖిల్!

తెలుగు సినిమా నట దిగ్గజం స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి నేడు. ఆయన జన్మదినం సందర్బంగా అఖిల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే తాత.. నీవు ఎంతో కష్టపడి అక్కినేని అనే పేరుని ఉన్నత స్థాయిలో ఉంచావు. ఆ పేరు నిలబెట్టేలా ప్రతి రోజు శక్తివంచన లేకుండా కష్టపడుతా అంటూ అఖిల్ ట్వీట్ చేశాడు.

ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని నిన్ననే అఖిల్ 3 వ చిత్రం మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియోగా అఖిల్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. టీజర్ రూపంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Akhil emotional tweet on ANR birth anniversary

తొలి ప్రేమ చిత్రంతో విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X