క్లారిటీ ఇచ్చిన అఖిల్.. మిస్టర్ మజ్ను విడుదల ఎప్పుడంటే!
అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియో తరహా పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో నిరాశపరిచాయి.
దీనితో ఈ సారి యువతని ఆకట్టుకునే అంశాలతో రావాలని అఖిల్ డిసైడ్ అయ్యాడు. ఈ చిత్ర విడుదల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని భావించారు. జనవరిలో భారీ చిత్రాల విడుదల ఉండడంతో మిస్టర్ మజ్ను చిత్రం వాయిదా పడొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా అఖిల్ మిస్టర్ మజ్ను విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సినిమా జనవరిలోనే విడుదలవుతుందని తేల్చి చెప్పేశాడు.

అఖిల్ ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో పేర్కొంటూ.. డిసెంబర్ 3 కల్లా సినిమా పూర్తవుతుంది. మిగిలిఉన్న ఒకే ఒక్క సాంగ్ ని కూడా త్వరగానే పూర్తి చేస్తాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇన్నిరోజులు ఓపికగా ఎదురుచూసినందుకు ధన్యవాదాలు అని అఖిల్ తెలిపాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











