అందుకే డెలివరీ బాయ్‌పై దాడి.. యువ హీరో అఖిల్ రాజ్ రియాక్షన్

రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్, హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. డెలివరీ బాయ్‌పై అఖిల్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాంతో ఆయనపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగగా.. చిత్ర పరిశ్రమలోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అఖిల్ రాజ్ స్పందించారు. ఈ గొడవకు దారి తీసిన కారణాలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే.

నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో సర్క్యూలేట్ అవుతోంది. కొండాపూర్‌లో రమేశ్ అనే డెలివరీ అబ్బాయి మా ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీ‌లో 201 అనే ఫ్లాట్‌లో ఇవ్వాల్సిన పార్శిల్‌ను అరుణా రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. డెలివరీ అడ్రస్ మీద క్లియర్‌గా రాసున్నది ఏంటంటే? అపోజిట్ టూ అరుణా రెసిడెన్సీ 201, నేను ఆ ఫోటో కూడా మీకు పెడతాను. మా ఇంటిలో మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు ఆర్డర్ చేసి ఉంటారని మా నాన్న.. ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టి 201 అరుణ రెసిడెన్సీ అనగానే పార్శిల్ తీసుకున్నారు.

Akhil Raj Breaks Silence After Delivery Boy Assault Row Video Goes viral

ఇది మన ఇంట్లో వాళ్లే పెట్టారా? అని మా నాన్న అడిగే లోపే చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చేముందు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం డెలివరీ బాయ్‌కి ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఓటీపీనో లేదంటే కాల్ చేశో, పేరు కనుక్కుని.. క్రాస్ చెక్ చేసుకుని డెలివరీ చేయాలి. ఆ అబ్బాయి ఫస్ట్ తప్పు చేశాడు, రాంగ్ అడ్రస్‌లో ఇచ్చేసి వెళ్లిపోయాడు. అయితే విషయం తెలియకుండా మా అమ్మ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేశారని చూసింది.

ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి మళ్లీ వచ్చాడు. ఓ బాధ్యతగల పౌరుడిగా నేను అడిగిన క్వశ్చన్.. బ్రదర్ మీరు అసలు అడ్రస్ క్రాస్ చెక్ చేసుకున్నారా అని అడిగా.. అప్పుడు ఆ అబ్బాయి నేను చూసుకోలే, ఇచ్చేస్తాను ఏం చేస్తావ్ ఇప్పుడు అని తేడాగా మాట్లాడాడు. అప్పటికే తాగేసి ఉండటం వల్ల వచ్చిన పదాలు అవి. అలా కాదు.. మంచిగా మాట్లాడు అని చెబుతుండగా మా మమ్మీ వచ్చి కొంచెం ఓపెన్ అయ్యింది, తీసుకోండి అని పార్శిల్ ఇచ్చింది. ఏందే ఫ్రీగా ఇస్తే తీసుకుంటారా? అంటూ మాట్లాడాడు.

ఒక కొడుకుగా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మా అమ్మనో, లేక మీ అమ్మనో ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోరు కదా? ఊరికే ఎవరో ఒకరి మీదకి వెళ్లడానికి నాకేమైనా పిచ్చా? ఆ అబ్బాయితో గొడవ పడితే నాకేమైనా వస్తదా? నా కెరీర్‌కు ఏమైనా హెల్ప్ అవుతదా? నేను కూడా ఒకప్పుడు డెలివరీబాయ్‌గా పనిచేసి ఈరోజు హీరో స్థాయికి ఎదిగా. ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించా.. అలాంటిది ఓ అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తీయాలని నేనెందుకు అనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు, తాగేసి వచ్చి ఎక్కడో ఇవ్వాల్సిన ఆర్డర్ ఇక్కడ ఇచ్చాడు.

మా ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీ 201 వాళ్లు.. అపోజిట్ టూ అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ల వల్ల చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. ఇలాంటిది జరగడం పదోసారి.. ఒకసారి కండోమ్ ప్యాకెట్స్ వచ్చాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. మీ మమ్మీ, మీ ఫ్యామిలీతో ఉంటున్నప్పుడు సిగరెట్ ప్యాకెట్స్, కండోమ్ ప్యాకెట్స్ వస్తే మీరు తీసుకోగలుగుతారా? అది ఎంత సిగ్గుగా ఉంటుంది. నిజానిజాలు తెలియకుండా నా మీద సోషల్ మీడియాలో అందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నీకింత బలిసిందా? అంటూ నా పేరెంట్స్‌ని, నన్ను ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ల మీద నెగిటివ్‌గా మాట్లాడితే.. నువ్వు రాంగ్ అడ్రస్‌లో ఇచ్చావని ఆ అబ్బాయిని అడగటానికి వెళ్లా.

ఆ అబ్బాయి మెట్లు దిగుతూ ఫోన్ తీసి నువ్వు హీరో కదా.. నిన్ను వైరల్ చేస్తానని మాట్లాడాడు. నీ ఆర్డర్ నీకు ఇచ్చేశాక మర్యాదగా కిందకి వెళ్లిపోమ్మని చెబుతుంటే ఆ అబ్బాయి ఫోన్‌లో వీడియో తీశాడు. దాంతో మా అమ్మనాన్న చాలా కంగారుపడ్డారు. ఇప్పుడిప్పుడే నా బిడ్డ ఎదుగుతున్నాడు.. ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడని వాళ్లు టెన్షన్ పడ్డారు. నా మీద జరిగిన ఈ ఆరోపణలపై నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ కూడా చేశా. నేను కానీ, మా అమ్మనాన్న తప్పు చేసుంటే ఖచ్చితంగా క్షమాపణలు చెబుతాం. నేను కావాలని వాళ్ల మీదకి వెళ్లలేదు.. ఆ అబ్బాయి మా అమ్మని తప్పుగా మాట్లాడాడు, నోరు అదుపులో పెట్టుకోమ్మని మాత్రమే చెప్పా, వాడిని నేను కొట్టలేదు. మా నాన్న నన్ను ఆపడానికి ట్రై చేశాడు.

తప్పు నాదైతే తలవంచుకుని వెళ్లిపోతా.. కానీ ఆ డెలివరీ బాయ్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే హుక్కా బాటిల్స్, బైక్‌ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నాడు. ఆ డెలివరీ బాయ్ అమాయకుడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. డెలివరీ అబ్బాయిలు ఎవరైనా వస్తే మా అమ్మనాన్నలు మజ్జిగ ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మని అన్న మాట మాత్రం తప్పు.. నేను ఉమ్మేశానని డెలివరీ బాయ్ చెబుతున్నాడు, సీసీటీవీ ఫుటేజ్ తీసి చూడండి. నిజానిజాలు తెలుసుకున్నాకే ఒక ఆరోపణ చేయండి.. నేను తప్పు చేయలేదని తేలితే నా మీద కామెంట్స్ పెడుతున్నవారు ఏం సమాధానం చెబుతారు. నేను ఏ తప్పూ చేయలేదు.. మా అమ్మని అనకూడని మాటంటే రియాక్ట్ అయ్యాను. హీరోగా ఉన్న నేను అలా చేసుండకూడదు, అది తప్పే.. స్టేషన్‌లో చెప్పాల్సింది. ఆ అబ్బాయి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.. నా వీడియో తీస్తానని చెప్పి ఈ వీడియో పెట్టాడు అని అఖిల్ రాజ్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డెలివరీ బాయ్ స్పందన కోసం నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Read more about: akhil raj Raju Weds Rambai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X