సెన్సార్ పూర్తి చేసుకున్న మిస్టర్ మజ్ను.. గ్రాండ్ రిలీజ్‌కు రెడీ!
అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్ రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. టీజర్, ట్రైలర్స్ లో అఖిల్ వేసే లవర్ బాయ్ వేషాలు ఆకట్టుకుంటున్నాయి. అఖిల్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు మిస్టర్ మజ్ను చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీనితో మిస్టర్ మజ్ను చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధమైంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో ఈ చిత్రంలో అఖిల్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేశాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ తెరకెక్కించిన తొలిప్రేమ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత.


Click it and Unblock the Notifications











