'మిస్టర్ మజ్ను' టీజర్‌కు ముహూర్తం ఖరారు!
అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.అఖిల్ ఈ చిత్రంలో లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
రెండు ఫెయిల్యూర్స్ తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో అఖిల్ తాడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రచార కార్యక్రమాలు పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు చిత్రం పై మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర టీజర్ కు ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 2న సాయంత్రం 6 గంటలకు మిస్టర్ మజ్ను టీజర్ విడుదల కానుంది. యువతకు బాగా లవ్, రొమాంటిక్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నూతన సంవత్సరం 2019 అఖిల్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











