అఖిల్ సార్థక్ అరుదైన రికార్డు: స్టార్ హీరోలతో సమానంగా కొట్టేశాడు.. ఫస్ట్ మూవీకే ఈ రేంజ్‌లో!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. టీఆర్పీ పరంగానూ.. రికార్డుల పరంగానూ ఈ షో ఎన్నో మైలురాళ్లను అందుకుంది. అంతేకాదు, దీని వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో నాలుగో సీజన్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఒకడు. అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించినా.. దక్కని గుర్తింపు ఈ షో ద్వారా అతడి సొంతం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా హీరోగా తన తొలి సినిమాను ప్రకటించాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా మొదలైన కెరీర్.. బిగ్ బాస్ ఆఫర్

అలా మొదలైన కెరీర్.. బిగ్ బాస్ ఆఫర్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. డిజైరబుల్ మ్యాన్ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, 'కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిసి బిగ్ బాస్‌ చాన్స్ పట్టేశాడు.

హౌస్‌లో ప్రేమాయణంతో యమ ఫేమస్

హౌస్‌లో ప్రేమాయణంతో యమ ఫేమస్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సార్థక్.. ఆరంభంలోనే హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగిస్తూ ఫేమస్ అయ్యాడు. తరచూ ఆమెతోనే ఉండడం.. ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులిచ్చుకోవడం వంటివి చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఫినాలేకు చేరుకుని రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడీ యంగ్ మ్యాన్.

బయట కూడా రచ్చ.. ఓనర్ అయ్యాడు

బయట కూడా రచ్చ.. ఓనర్ అయ్యాడు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ యమ బిజీ అయిపోయాడు. తరచూ మోనాల్ గజ్జర్‌తో కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు. అలాగే, సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ఇక, ఇటీవలే ఓ కారును కూడా కొనుగోలు చేశాడు. అంతేకాదు, ఓ బైక్‌ను కూడా కొన్నాడు. వీటికి సంబంధించిన అప్‌డేట్లు తరచూ ఇస్తున్నాడు.

ఆమెతో కలిసి వెబ్ సిరీస్‌ను ప్రకటించి

ఆమెతో కలిసి వెబ్ సిరీస్‌ను ప్రకటించి

బిగ్ బాస్ షో తర్వాత అఖిల్ సార్థక్‌కు వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, దానికి సంబంధించిన ప్రకటనలు ఏమీ చేయలేదతను. అయితే, గత ప్రేమికుల రోజున మాత్రం మోనాల్ గజ్జర్‌తో కలిసి 'తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కించనున్నారు.

హీరోగా మొదటి సినిమా.. అలా ఎంట్రీ

హీరోగా మొదటి సినిమా.. అలా ఎంట్రీ

అఖిల్ సార్థక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మేరకు ఉగాది పండుగ రోజున తన మొదటి సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను వదిలాడు. ఈ చిత్రానికి 'ఫస్ట్ టైమ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ వైలెంట్‌గా కనిపించాడు. ఐ హేమంత్ నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అనిక విక్రమన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నాడు.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
స్టార్ హీరోలతో సమానంగా కొట్టేశాడు

స్టార్ హీరోలతో సమానంగా కొట్టేశాడు

ఉగాది రోజున అఖిల్ సార్థక్ తన మొదటి సినిమాను ప్రకటించాడు. ఇక, దీనిని సపోర్ట్ చేస్తూ చాలా మంది ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే #FirstTime హ్యాష్ ట్యాగ్‌పై 24 గంటల్లోనే ఏకంగా రెండు లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. తద్వారా మొదటి సినిమాతోనే ఈ రేంజ్ ట్వీట్లు అందుకున్న హీరోగా అఖిల్ రికార్డు సాధించాడు. అదే సమయంలో ట్రెండ్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X