మజ్నులో అఖిల్ మరో సర్‌ప్రైజ్.. సాంగ్ మొత్తం షర్ట్ లేకుండా!
అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మజ్ను. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్‌లో అఖిల్ ఆశ్చర్యపరిచాడు. కొత్త గెటప్‌లో లవర్ బాయ్‌గా మారిపోయాడు. అమ్మాయిల వెంటపడే రోమియోలా అఖిల్ పాత్ర ఈ చిత్రంలో సరదాగా సాగనుంది.
తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో అఖిల్ మజ్నుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. మజ్నుచిత్రం గురించి ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడట. సిక్స్ ప్యాక్ లుక్ కోసం అఖిల్ తీవ్రమైన కసరత్తులు చేసినట్లు చెబుతున్నారు.

అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ ని సాంగ్ లో చూపిస్తారట. ఆ సాంగ్ కు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ షూటింగ్ పూర్తయ్యే వరకు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా లుక్ మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ సాంగ్ మొత్తం అఖిల్ షర్ట్ లేకుండానే పెర్ఫామ్ చేస్తాడట.


Click it and Unblock the Notifications











