అఖిల్ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. సురేందర్ రెడ్డితో అలా ఫిక్స్!
అక్కినేని వారసుడు అఖిల్ ఒక్క సక్సెస్ కోసం నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదటి చిత్రం అఖిల్ నుంచి సరైన విజయం కోసం తన వంతుగా కృషి చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంత వరకు అఖిల్‌కు ఒక్క హిట్టు కూడా రాలేదు. హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యాయి. కానీ అవి ఆశించినంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక అఖిల్ తన నాల్గో చిత్రంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు ఓ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురాబోతోన్నాడు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ అఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. పూజా హెగ్డే అఖిల్ కెమిస్ట్రీ బ్యాచ్‌లర్ సినిమాకు బాగానే కలిసి వచ్చేలా ఉంది. ఈ మేరకు వదిలిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లను రెడీ చేశాడు. బ్యాచ్‌లర్ పూర్తి అవ్వడంతోనే తన ఐదో ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ పనుల్లో అఖిల్ బిజీగా కానున్నాడు.

అఖిల్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్బంగా తన ఐదో ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోంది. ఈమేరకు నిర్మాణ సంస్థ ఓ ట్వీట్ వేసింది. బర్త్ డే సందర్భంగా అఖిల్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ రాబోతోందంటూ ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు బయటకు రానుందని తెలిపారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌లో రెండు గన్స్ ఉండగా.. ఒకరు చంపేందుకు రెడీగా ఉన్నారు.. మరొకరు ఆశ్చర్యపరిచేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











