Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొత్తానికి ఒక కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్న అఖిల్..!
అక్కినేని యువ హీరో నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అఖిల్ ఎలాగైనా ఆ సినిమాతో సక్సెస్ కొట్టాలని చాలానే ఆశపడుతున్నాడు గాని ఇంకా ఆ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావటం లేదు. మొదటి నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద అఖిల్ పెద్దగా సత్తా చాటలేకపోతున్నాడు. మొదట సినిమా అఖిల్ తో పాటు ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా పెద్దగా లాభాలు అంధించలేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అఖిల్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ విషయం పక్కనపెడితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ఎనౌన్స్మెంట్ రాగానే అంచనాలు భారీగానే పెరిగాయి. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ కు మించి సెట్ చేసినట్లు టాక్. అయితే ఆ సినిమాలో అఖిల్ కు జోడిగా స్టార్ హీరోయిన్ నటిస్తుందని మొదట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక బడ్జెట్ ఇప్పటికే ఎక్కువ అయ్యిందని హీరోయిన్ విషయంలో నిర్మాతలు తగ్గినట్లు సమాచారం.
కొత్త హీరోయిన్ ని తీసుకోవడం బెటర్ అని ముంబైకు చెందిన మోడల్ ను ఫిక్స్ చేశారని కూడా రెండు నెలలుగా రూమర్స్ వస్తున్నాయి. ఆమె పేరు సాక్షి వైద్య అని తెలుస్తోంది. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమెను ఇటీవల ఆడిషన్ చేయగా దర్శకుడు మరో అనుమానం లేకుండా మొదటి రోజే ఫిక్స్ చూసుకున్నాడట. హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చి షూటింగ్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.