మొదటిసారి దైవ దీక్షలో అక్కినేని హీరో.. డిప్రెషన్‌లోకి వెళ్లకుండా కఠోర నిర్ణయం!
అక్కినేని యువ హీరో అఖిల్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఫ్యాషన్ వరల్డ్ కి అలాగే స్నేహితులకు, పార్టీలకు పబ్ లకు దూరంగా ఉండాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేటితరంలో కూడా ఇలాంటి కుర్రాళ్ళు ఉంటారా? అది కూడా ఫ్యాషన్ లైఫ్ కి అలవాటు పడ్డ అఖిల్ లాంటి యువకుడు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

అఖిల్ కష్టపడుతున్నాడు..కానీ..
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సరిపోదు. ఎవరైనా సరే కష్టపడితేనే అభిమానుల మనసును గెలుచుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు. ప్రస్తుతం టాలీవుడ్ లో అదే తరహాలో అఖిల్ కూడా కష్టపడుతున్నాడు. అయితే ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద అఖిల్ సరైన సక్సెస్ అందుకోలేదు.

అయ్యప్ప స్వామి దీక్షలో..
అయితే ఏమయ్యిందో ఏమో గాని సడన్ గా అఖిల్ అయ్యప్పస్వామి దీక్షలోకి వెళ్ళాడు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మరింత ఆలస్యం కానుంది.

డిప్రెషన్ కారణంగా..
ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. ఒకవేళ తెరచుకున్నా కూడా జనాలు థియేటర్స్ వరకు వచ్చేలా లేరు. పైగా ఆ సినిమాపై అనుకున్నంత అంచనాలు కూడా లేవు. అయితే అఖిల్ తన కెరీర్ విషయంలో కాస్త డిప్రెషన్ కి గురవ్వడం వలన సన్నిహితుల సలహాతో అయ్యప్ప మాల వేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

అక్కినేని ఫ్యామిలీలో మొదటి హీరో..
ఇంతవరకు అక్కినేని ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలాంటి దీక్ష చేయలేదు. వాళ్ళు చాలా వరకు సినిమా ఫ్యాషన్ లైఫ్ తోనే బిజీగా గడుపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్స్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎదో ఒక దైవ దీక్షలో ఉంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో ఎవరు లేరని అనుకుంటున్న సమయంలో అఖిల్ సడన్ గా సర్ ప్రైజ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications