క్రేజీ హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్!
భారీ అంచనాలతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. తొలి చిత్రం నుంచి అఖిల్ పరాజయాలు వెంటాడుతున్నాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం కోసం ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అఖిల్ మంచి కథని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. అఖిల్ తదుపరి చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఉండబోతునలు బలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన కథ అఖిల్ ని ఎంతగానో ఆకర్షించిందట. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ ప్లాపుల్లో ఉన్నా కూడా అఖిల్ ఓకే చెప్పాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కు అంతా సిద్ధం అయింది. కానీ అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ కోసం బొమ్మరిల్లు భాస్కర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కియారా అద్వానీ బిజీ షెడ్యూల్ కారణంగా అఖిల్ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోతోందని అంటున్నారు. అందుకే కియారా అద్వానీ అంగీకరించే వరకు బొమ్మరిల్లు భాస్కర్ వేచి చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా ఒకే చెబితే వెంటనే షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











