నాగ చైతన్య అన్నీ సైలెంట్‌గా చేస్తాడు.. సేమ్ నాన్నలాగే.. చైతూపై అఖిల్ కామెంట్స్

సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

ఇప్పుడు తర్వలో ఏజెంట్ గా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన యాంకర్ సుమ ఇంటర్వ్యూలో నాగ చైతన్య, నాగార్జునపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు అఖిల్.

Akkineni Akhil Interesting Comments On Naga Chaitanya Nagarjuna Over Agent Interview

హీరోయిన్ గా ఆమె: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ నటించిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ మెగస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య చేస్తోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకతుడు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సిక్స్ ప్యాక్ బాడీతో: ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ విపరీతంగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్స్ సీన్స్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు అఖిల్. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ తరహాలో తెరకెక్కించిన ఏజెంట్ మూవీపై అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి.

Akkineni Akhil Interesting Comments On Naga Chaitanya Nagarjuna Over Agent Interview

ఒక్క సాంగ్ తప్పా: అఖిల్ ఏజెంట్ గా వస్తున్న ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంకా ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్సులో జోరుగా పాల్గొంటున్నాడు అఖిల్.

3 నెలలు కష్టంగా: తాజాగా ఏప్రిల్ 8న అతని పుట్టినరోజు సందర్భంగా స్టార్ యాంకర్ సుమతో స్పెషల్ చిట్ చాట్ చేశాడు అక్కినేని అఖిల్. ఈ సినిమా కోసం ఉప్పు కారం మసాలాలు, ఆయిల్ లేకుండా కంప్లీట్ డైట్ పాటించినట్లు ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. మొదటి 3 నెలలు కొద్దిగా కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైందన్నాడు. తన ట్రాన్స్ ఫర్మేషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని అఖిల్ చెప్పుకొచ్చాడు.

Akkineni Akhil Interesting Comments On Naga Chaitanya Nagarjuna Over Agent Interview

6 అయిందంటే చాలు: ఈ సినిమాలో రొమాన్స్ చాలా తక్కువగా ఉంటుందని, కానీ ఉన్నంతవరకు బాగా ఇంపాక్ట్ చూపిస్తుందని అఖిల్ పేర్కొన్నాడు. నాగార్జునకి కానీ, నాగ చైతన్యకు కానీ ఈ సినిమా గురించి అసలు ఏం తెలియదని ఇంట్లో వాళ్ల మధ్య అసలు సినిమా డిస్కషన్ ఉండదని అఖిల్ తెలిపాడు. "నాన్న గారు షూటింగ్ అయి 6 కి వచ్చారంటే అలా పక్కకు వెళ్లి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. డెస్టినేషన్స్ వంటి వాటి గురించి మాట్లాడతారు" అని అఖిల్ పేర్కొన్నాడు.

చైతూకి బాగా తెలుసు: చైతూ కూడా అలాగేనేనా అని సుమ అడిగితే.. "అవును, సేమ్ నాన్న లాగే అన్నయ్య. నేనే వాళ్లలో నాటీ అనిపిస్తుంది" అని అఖిల్ తెలిపాడు. వాళ్ల నుంచి ఏదానా తీసుకోవాలి అనిపిస్తే అన్న ప్రశ్నకు.. "నాన్న నుంచి కూల్ గా ఎలా ఉండాలనేది. అన్నయ్య సైలెంట్ కిల్లర్. అన్నీ సైలెంట్ గా చేసేస్తాడు. ఏది ఎక్కడ వదలాలో బాగా తెలుసు. కానీ నేను మాత్రం డే అండ్ నైట్ సినిమాలు తప్పా వేరే ఆలోచన లేదు" అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X