Akhil: ఏ హీరో చేయని సాహసం చేసిన అఖిల్.. ఛాతిపై బాదుకుంటూ వైల్డ్‌గా.. వీడియో వైరల్

చాలా కాలంగా మంచి సాలిడ్ హిట్ కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు అక్కినేని అఖిల్. హీరోగా మొదటి సినిమా అఖిల్ నుంచి ఇప్పటివరకు అతనికి చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ పర్వాలేదనిపించుకున్న స్టార్ డమ్ తెచ్చేంత సక్సెస్ కాలేదు. దీంతో తర్వాతి సినిమాతో గట్టి బ్లాక్ బస్టర్ అందుకోవాలనే ప్రయత్నంతో ఏజెంట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్. ఈ మూవీ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్న అఖిల్ తాజాగా ఎవరూ ఊహించని పని చేశాడు.

సాక్షి వైద్యతో:మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

Akkineni Akhil Jump From 172 Feet Building Over Agent Movie Trailer Launch Poster

జోరుగా ప్రమోషన్స్:ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ విపరీతంగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్స్ సీన్స్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు అఖిల్. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ తరహాలో తెరకెక్కించిన ఏజెంట్ మూవీపై అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఛాతిపై బాదుకుంటూ:తాజాగా ఏజెంట్ ట్రైలర్ లాంచ్ డేట్ పోస్టర్ ను అఖిల్ ఆవిష్కరించాడు. ఈ పోస్టర్ రిలీజ్ క్రమంలో గతంలో ఏ హీరో చేయని సాహసాన్ని ప్రదర్శించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు అఖిల్. విజయవాడలోని పీవీపీ మాల్ పై నుంచి జంప్ చేస్తూ ట్రైలర్ లాంచ్ పోస్టర్ రివీల్ చేశాడు. సుమారు 172 ఫీట్ల ఎత్తు నుంచి రోప్స్ సహాయంతో కిందకు దూకేశాడు అఖిల్. అలా దూకుతూ ఛాతిపై బాదుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Akkineni Akhil Jump From 172 Feet Building Over Agent Movie Trailer Launch Poster

ఏప్రిల్ 18న:అఖిల్ అలా ఫీట్ చేస్తుంటే చూసేందుకు వచ్చిన అభిమానులతో మాల్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అఖిల్ జంప్ చేసేటప్పుడు ఫ్యాన్స్ అరుస్తూ ఎంకరేజ్ చేశారు. ఇక ట్రైలర్ లాంచ్ పోస్టర్ లో షర్ట్ లేకుండా ఉన్న అఖిల్ వైల్డ్ లుక్ అదిరిపోగా.. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏజెంట్ ట్రైలర్ లాంచ్ జరగనుందని తెలిపారు.

వైల్డ్ సాలా:ఇదిలా ఉంటే అఖిల్ జంప్ చేసే వీడియోను నిర్మాత అనిల్ సుంకర్ షేర్ చేశారు. 'దూకు.. దూకు.. దుమ్ము రేపు అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే 'సాలా నహి.. వైల్డ్ సాలా' అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ ఫీట్ చూసిన తర్వాత అభిమానులు, నెటిజన్లు.. అఖిల్ ధైర్యానికి, గట్స్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అఖిల్ కష్టాన్ని చూసి సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి మరికొందరు మాత్రం ప్రమోషన్స్ కోసం ఇదంతా చేయడం అవసరమా అని కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X