నాగచైతన్య, శోభిత గాసిప్స్ పై అఖిల్ ఊహించని కామెంట్.. ఏమన్నాడంటే?
అక్కినేని నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఒక ప్రత్యేకమైన ప్లాట్ లో ఉంటున్నట్లుగా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. సినిమా షూటింగ్స్ అలాగే తన ఫ్రెండ్స్ ఇలా చాలా తక్కువ సర్కిల్ లోనే నాగచైతన్య బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అతను మళ్ళీ ప్రేమలో పడ్డాడు అని ఒక హీరోయిన్ తో డేటింగ్ కూడా చేస్తున్నాడు అని అనేక రకాల వార్తలు ఈ మధ్య వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై కొన్ని ప్రశ్నలు అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్ లో ఎదురుపడ్డాయి. ఇక అఖిల్ తనకు ఎదురైన ప్రశ్నకు ఊహించిన విధంగా ఒక సమాధానం అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఫొటోస్ లీక్:అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాల ప్రేమించుకుంటున్నట్లుగా చాలా కాలంగా కొన్ని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు కలిసి విదేశాలకు కూడా వెళ్లారని.. అక్కడ ఒక హోటల్లో ఉన్న ఒక ఫోటో కూడా లీక్ కావడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి.

రూమర్స్ ఎన్ని వచ్చినా..:నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా కథనాలు వైరల్ కావడంతో అందరూ నిజమే అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే నాగచైతన్య సన్నిహితుల ప్రకారం అతను ఎలాంటి డేటింగ్ లో లేడు అని కూడా తెలుస్తోంది. వీలైనంతవరకూ తన సినిమా షూటింగ్స్ ముగించుకొని నాగచైతన్య ప్రైవసీ జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రూమర్స్ ఎన్ని వచ్చిన కూడా అతను వేటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదట.
మీ అన్నయ్య ఫొటోలు వైరల్:ఇక అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా అతనికి నాగచైతన్య పై వస్తున్న రూమర్స్ గురించి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే వాటిపై అతను పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదు. మీ అన్నయ్యవి ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరో ఒక అమ్మాయితో ఉన్నట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి అని ఒక విలేకరి అఖిల్ ను ప్రశ్నించారు.

నా పరిస్థితి ఇది:అయితే అఖిల్ ఆ ప్రశ్నలకు పెద్దగా సమాధానం ఇవ్వలేదు. అయితే ఇంతకు మీ పరిస్థితి ఏమిటి అని అడగడంతో వెంటనే అతను చాలా స్వీట్ గా ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు. నా పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఏజెంట్ సినిమా అంటూ.. దాదాపు రెండేళ్లుగా ఈ పిలకతో అలాగే బాడీ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. నా లైఫ్ కు ఇదే చాలా సరిపోయింది అంటూ అతను సరదాగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రిలీజ్ లో చిన్న మార్పులు:అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదట పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే హిందీలో కూడా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో వెనకడుగు వేశారు. హిందీలో కాకుండా మిగతా అన్ని భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో మాత్రం కొంత గ్యాప్ తీసుకొని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











