Naga Chaitanya సమంత తప్ప ఇంకో ఆప్షన్ వద్దు.. మాజీ భార్యపై నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అనగానే నాగచైతన్య, సమంత గుర్తుకువచ్చేవారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ వీరి వివాహ బంధం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఏమైందో తెలియదు.. విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే వీరు ఎప్పటికైనా కలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. సమంత తప్ప తనకు ఇంకో ఆప్షన్ వద్దని నాగచైతన్య ఓ వీడియోలో చెప్పుకువచ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

చైతూను మాయ చేసిన సామ్: అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య.. ఇండస్ట్రీలోకి జోష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మొదటి సినిమాపై పలు విమర్శలు వచ్చినా.. రెండో సినిమాతోనే చైయ్ అమ్మాయిల మనసును దోచాడు. ఏ మాయ చేశావే అంటూ సమంత కూడా తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ భామ అబ్బాయిల మనసును దోచేస్తే.. ఆమె మనసును చైతూ కొల్లగొట్టాడు. ఇక అలా కొన్నాళ్లు ఈ జంట ప్రేమలో మునిగితేలింది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ జంట అభిమానులకు షాకిచ్చారు.

Akkineni Naga Chaitanya Comments on Ex Wife Samantha Love Video Goes Viral

ఇద్దరూ విడిగానే: 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు తెలిపారు. ఇక క్యూట్ కపుల్స్ లా ఉండే వీరు విడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. వీరు కలిస్తే బాగుండు అని ఇప్పటికీ కామెంట్స్ పెడుతుంటారు. అయితే విడాకుల తర్వాత సమంత కానీ, నాగచైతన్య కానీ ఎవ్వరు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు విడిగానే ఉంటూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.

తండేల్ సినిమాతో బిజీగా: ఇక ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటుంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు నాగచైతన్య సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల చైతూ చేసిన రీల్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

సామ్ తప్ప ఎవరూ వద్దు: అయితే నాగచైతన్యకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రదీప్ యాంకర్ గా నిర్వహించిన ఓ షోలో నాగచైతన్య పాల్గొన్నాడు. ఇక నాగచైతన్య.. సమంతగా ఫోన్ చేయగా.. అందులో చైతూ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా.. నేను సామ్ నే ఎందుకు ప్రేమించాను అని అడుగుతాడు. దీనికి సమంత నవ్వుతూ.. నీకు ఇంకో ఛాన్స్ లేదని చెప్తుంది. అప్పుడు నాగచైతన్య కూడా నాకు నువ్వు తప్ప ఇంకో అప్షన్ వద్దని చెప్తాడు.

మ్యాజిక్ జరగాల్సిందే: అయితే ఈ వీడియో పాతది. వీరు విడాకులు తీసుకోకముందు మాట్లాడింది. ఇక ఈ వీడియోను ఇప్పుడు సమంత, నాగచైతన్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సమంత, చైతూ కలవాలని కోరుకంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక చైతూ నిజంగానే సమంతను తప్ప వేరే ఎవరిని ప్రేమించలేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చైతూ పెళ్లి చేసుకోకుండా విడిగానే ఉంటున్నారు. దీంతో వీరు మళ్లీ కలిస్తే బాగుండని అంటున్నారు. మరి వీరు నిజంగా కలవాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాలేమో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X