అక్కినేని హీరోతో థ్రిల్లర్ మూవీ.. 13B సీక్వెల్ అంటున్నారే?
అక్కినేని యువ హీరో నాగ చైతన్య మొత్తానికి మజిలీ సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. చాలా రోజుల తరువాత సతీమణి సమంత సపోర్ట్ తో బాక్సాఫీస్ హిట్టు అందుకున్న నాగ చైతన్య ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇక కథల విషయంలో అప్పుడప్పుడు సమంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడట.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ చైతన్య ఇటీవల చాలా మంది దర్శకులతో కొత్త కాన్సెప్ట్ ల గురించి చర్చించారట. దాదాపు ముగ్గురు దర్శకులు చెప్పిన కాన్సెప్ట్ లపై చైతు పాజిటివ్ గా స్పందించాడట. వాటిపై లాక్ డౌన్ తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన మరో ఐడియా కూడా అక్కినేని హీరోకు బాగా నచ్చేసిందట. 2009లో వచ్చిన 13B సినిమాకు కొనసాగింపుగా మరో సినిమను చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడట.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న 13B హారర్ ప్లస్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. కానీ అలాంటి సినిమా చైతుకి ఎంతవరకు సెట్టవుతుందో తెలియదు గాని దర్శకుడు మాత్రం చాలా కాలంగా ఆ కథకు సీక్వెల్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. చివరగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ అనుకున్నంతగా సక్సెస్ సాదించలేకపోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా అక్కినేని హీరోతోనే ప్లాన్ చేయాలని రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











