తీన్‌మార్ డ్యాన్సులు, డీజే మోతలతో నాగచైతన్య బరాత్.. సైలెంట్‌గా షాకిచ్చాడుగా
ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సైలెంట్‌గా విడాకులు కానిచ్చేసిన ఈ జంట పెళ్లెప్పుడు చేసుకుంటుందని మీడియాలో , సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివరికి లేదంటే కొత్త ఏడాది మార్చిలో వీరి వివాహం జరుగుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కినేని బ్రాండ్ నేమ్‌కు తగినట్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ వైపే చైతూ- శోభితలు మొగ్గుచూపుతున్నట్లుగా టాక్.
ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేంద్రాలుగా ఉన్న గోవా , మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక చోట చైతన్య - శోభితల వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. గతంలో సమంతను పెళ్లాడినప్పుడు కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు నాగచైతన్య. అప్పట్లో వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగి, ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. నాగచైతన్యకు ఇది రెండో పెళ్లే అయినా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా ఏర్పాట్లు ఉంటాయని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య - శోభితల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతోంది, గెస్ట్‌లుగా ఎవరెవరు హాజరుకానున్నారు అనే దానిపై అక్కినేని , అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. పెళ్లికి టైం పట్టేలా ఉండటంతో కొత్త జంట తమ చేతుల్లో ఉన్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. వివాహం తర్వాత హనీమూన్ ట్రిప్ వేసి తర్వాత తీరిగ్గా కొత్త ప్రాజెక్ట్స్‌ని ఓకే చేయాలని భావిస్తున్నారట చై- శోభిత.
ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు అదే తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార కుటుంబాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాలను, వారి వేషభాషలను, చేపలు పట్టడం, సముద్రంలో ఎలా జీవించాలో దగ్గరుండి నేర్చుకుంటున్నారట. డిసెంబర్‌లో తండేల్ ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమాలతో పాటు కారు రేసింగ్‌లంటే నాగచైతన్యకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఫార్ములా రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్స్డ్ టీమ్‌ను చైతన్య కొనుగోలు చేశారు. అంతేకాదు. .ఫార్ములా వన్‌లో ఓ రేసింగ్ టీమ్ యజమానికి నిలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఆగస్ట్ 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే.
ఇక నాగచైతన్య సినిమాలతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగునాట షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి కూడా ఆయన వెళ్తుంటారు. తాజాగా హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చారు చైతూ. ఈ సందర్భంగా ఆయనను ఓ పెళ్లి కొడుకులా తీసుకొచ్చారు నిర్వాహకులు. ప్రత్యేకంగా వింటేజ్ కారును తెప్పించి ఆయన షాపింగ్ మాల్ వరకు తొడ్కోని వచ్చారు. చైతూ ముందు తీన్‌మార్ డ్యాన్సులు, స్టెప్పులు, డీజే బాక్స్‌ల హోరుతో పెళ్లి బరాత్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈవెంట్ నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాగచైతన్య నిజంగా పెళ్లి బరాత్‌లో పాల్గొన్నాడా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











