నిజాయితీ ఉంటేనే కనెక్ట్ అవుతారు... నాగచైతన్య షాకింగ్ పోస్ట్
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ స్టార్ హీరోయిన్ సమంత సైలెంట్‌గా షాకిచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని సామ్ పెళ్లాడారు. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో సమంత - రాజ్ నిడిమోరుల పెళ్లి జరిగింది. వీరి వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి. భూత శుద్ది వివాహం అనే సాంప్రదాయాన్ని అనుసరించి సమంత - రాజ్ నిడిమోరులు ఒక్కటయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను సమంత విడుదల చేయడంతో ఇండస్ట్రీ జనాలు, ప్రజలు షాక్ అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో సమంత మాజీ భర్త, హీరో అక్కినేని నాగచైతన్య చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు. మయోసైటిస్ వ్యాధి బారినపడి దానికి చికిత్స తీసుకుంటూనే నటనను కొనసాగించారు. పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. ఈ క్రమంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ సీక్రెట్‌గానే తమ బంధాన్ని కొనసాగించారు. ఎప్పుడైతే నాగచైతన్య - శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి పరిణామాలు మారిపోయాయి.

నాగచైతన్య సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినట్లే.. సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే రాజ్ నిడిమోరు - సమంతలు ప్రేమించుకుంటున్నారని మీడియాలో గాసిప్స్ వచ్చాయి. మా మధ్య ఎలాంటి బంధం లేదని ఇద్దరూ ఖండించారు. అయితే సమంత ఎక్కడ ఉంటే రాజ్ అక్కడ ఉండటం.. ఇద్దరూ పార్టీలు, వెకేషన్స్, జిమ్‌కి కలిసి హాజరవుతుండటంతో ఏదో జరుగుతుందని మీడియా కోడై కూసింది. కానీ సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ వ్యవహారాలు రాజ్ దగ్గరుండి చూసుకోవడంతో పాటు ఫ్లైట్‌లో రాజ్ భుజంపై సమంత పడుకోవడంతో వీరిద్దరి మధ్య బంధం నిజమేనని వార్తలు వచ్చాయి. దీనికి తోడు రాజ్ నిడిమోరు భార్య పరోక్షంగా చేస్తూ వచ్చిన కామెంట్స్ కూడా అనేక అనుమానాలకు తావిచ్చాయి.
రాజ్, సమంతలు తమ మధ్య ఉన్న బంధాన్ని బయటి ప్రపంచానికి చెబుతారని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. దీనిపై అక్కినేని కుటుంబం, ముఖ్యంగా నాగచైతన్య ఎలా రియాక్ట్ అవుతారోనని జనం ఎదురుచూశారు. అయితే అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఆశ్చర్యకరంగా సమంత రెండో పెళ్లి చేసుకున్న రోజే నాగచైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం వైరల్ అవుతోంది.
నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సిరీస్‌కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా ఒక ప్రాజెక్ట్ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని దూత నిరూపించింది. ఓ నటుడిగా కొత్తగా, సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని నిజాయితీతో కష్టపడి పని చేస్తే అది ఎలాంటి పని అయినా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. దూత రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు అని నాగచైతన్య రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా టైం చూసి చైతూ పోస్ట్ పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











