శోభితతో పెళ్లెప్పుడు.. నాగచైతన్యను చుట్టుముట్టిన మీడియా, ఒక్క ముక్కలో తేల్చేశాడుగా
ఊహాగానాలను నిజం చేస్తూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని ఇండస్ట్రీకి, అభిమానులకు పెద్ద షాకిచ్చారు. అప్పటికీ ఇది సినిమా కోసం జరుగుతున్న ఎంగేజ్‌మెంటా లేక నిజమా అని జనానికి ఏమీ అర్ధం కాలేదు. అయితే నాగార్జున అఫీషియల్‌గా ఈ ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫర్మ్ చేయడంతో అందరి మబ్బులు విడిపోయాయి. దీంతో సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న చైతన్య మరో వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించి ఓ ఇంటివాడు కావాలని వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అభిమానుల ప్రార్ధనలు ఫలించి నాగచైతన్య తన పార్ట్‌నర్‌ను తొందరగానే వెతుక్కున్నాడు. శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగానే ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

ఇదిలాఉండగా.. నాగచైతన్య సెకండ్ మ్యారేజ్‌పై అతని అమ్మమ్మగారైన దగ్గుబాటి కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడకపోవడం, కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించకపోవడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి విడిపోయిన తర్వాత చైతూ ఆలనా పాలనా కొన్నేళ్ల పాటు రామానాయుడి కుటుంబమే చూసింది. అలాగే నాగచైతన్య కెరీర్ విషయంలోనూ దగ్గుబాటి ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఇవాళ్టీకి ఉంటుందని టాక్.
సమంతతో విడాకుల తర్వాత చైతూ జీవితం ఏమవుతుందోనని ఆ కుటుంబం ఎంతో బాధపడిందట. అందుకే ఈసారి చైతన్యకి పెళ్లి చేస్తే తిరిగి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ భావిస్తోందట. అయితే చైతూ ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో నాగార్జున ఒక్కరే కనిపించగా.. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారో లేదో అనేది మాత్రం తెలియరాలేదు.
ఏది ఏమైతేనేం చైతన్య- శోభితల ఎంగేజ్‌మెంట్ ముగిసింది, మరి వీరి పెళ్లెప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలు అభిమానుల మనసులను తొలిచేస్తున్నాయి. చైతూ- శోభితల పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఫేమస్ స్పాట్ కోసం ఇరు కుటుంబాల పెద్దలు వెతుకుతున్నారట.
మరోవైపు.. శోభితను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రశ్న స్వయంగా నాగచైతన్యకే వేసింది మీడియా. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చారు చైతూ. ఈ సందర్భంగా ఆయనను మీ పెళ్లి , ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది.. డెస్టినేషనా లేదంటే హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా అని మీడియా ప్రశ్నించింది. పెళ్లంటే నా మనసుకు దగ్గరైన వాళ్లంతా ఉండాలి.. మన సంస్కృతి , సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకోవడం ఇష్టమని చైతన్య తెలిపారు. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేదానిపై త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం చైతూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











