ఆ టైప్ పెళ్లి కావాలంటోన్న చైతూ- శోభిత.. ఏది సెట్ అవ్వట్లేదా, వెతుకులాటలో నాగార్జున..?
ఊహాగానాలను నిజం చేస్తూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం చేసుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు. వీరిద్దరి బంధంపై గతంలోనే మీడియా కోడై కూసినా.. చాలా మంది గాలివార్తలుగానే కొట్టేశారు. కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న మాటలు మాట్లాడారు. కట్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ శోభిత వేలికి ఉంగరం తొడిగేశారు చైతన్య. ఆ రోజు కూడా మీడియా హడావుడి చేసినా జనం అంతగా కాన్‌సన్‌ట్రేట్ చేయలేదు.
చివరికి నాగార్జున అఫిషీయల్‌గా ఈ ఎంగేజ్‌మెంట్ నిజమేనని కన్ఫర్మ్ చేయడం, చైతూ- శోభితల ఫోటోలు బయటకు రావడం చకచకా జరిగిపోయింది. దీంతో సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న చైతన్య మరో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని వారు కోరుకున్నారు. వారి ఆశలు ఫలించి నాగచైతన్య తన పార్ట్‌నర్‌ను తొందరగానే వెతుక్కున్నాడు. శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగానే ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

ఇదిలాఉండగా.. నాగచైతన్య సెకండ్ మ్యారేజ్‌పై అతని అమ్మమ్మగారి వైపు నుంచి పెద్దలు ఎవరూ మాట్లాడకపోవడం, కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. చైతూ తండ్రి నాగార్జున తొలుత మూవీ మొఘల్ డాక్టర్ డీ. రామానాయుడు కుమార్తె, హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో కొన్నాళ్లకే వీరు విడిపోయారు.
చైతూ ఆలనా పాలనా కొన్నాళ్లు రామానాయుడి కుటుంబమే పెంచిందని అంటూ ఉంటారు. అలాగే నాగచైతన్య కెరీర్ విషయంలోనూ దగ్గుబాటి ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుందని టాక్. సమంతతో విడాకుల తర్వాత చైతూ జీవితంపై ఆ కుటుంబం ఎంతో మధనపడిందట. అందుకే ఈసారి చైతన్యికి పెళ్లి చేస్తే తిరిగి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ భావిస్తోందట. అయితే చైతూ ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో నాగార్జున ఒక్కరే కనిపించగా.. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలియడం లేదు.

ఈ సంగతి పక్కనబెడితే.. చైతన్య- శోభితల ఎంగేజ్‌మెంట్ ముగిసింది, మరి పెళ్లెప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ తంతు కూడా ముగిశాక సైలెంట్‌గా ఫోటోలు షేర్ చేస్తారా అని అక్కినేని ఫ్యాన్స్ భయపడుతున్నారు. చైతూ- శోభితల పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఒక కథనం ప్రకారం.. నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్ వేదికగా జరిగే అవకాశం ఉందట.
చైతూ, శోభితల కాల్షీట్లు.. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల్లోని ప్రముఖులు అందుబాటులో ఉండే సమయం చూసుకుని వీరి పెళ్లి, వివాహ వేదికపై ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే శోభిత- నాగచైతన్యలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా విదేశాల్లోని ఫేమస్ స్పాట్ కోసం ఇరు కుటుంబాల పెద్దలు వెతుకుతున్నారట. అయితే భారతదేశంలోని సెలబ్రెటీలలో ఎక్కువ మంది తమ పెళ్లికి రాజస్థాన్‌నే వేదికగా చేసుకున్న అనుభవాల దృష్ట్యా చైతూ- శోభితల పెళ్లి కూడా అక్కడి ఏదో ఒక రాయల్ ప్యాలెస్‌లో జరుగుతుందని ఫిలింనగర్ టాక్. గతంలో సమంత- నాగచైతన్యల వివాహం గోవాలో జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











