‘బంగార్రాజు’ను మొదలెట్టిన నాగార్జున: తొలిరోజే మూవీ నుంచి లీకైన మెయిన్ హైలైట్

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. 2016లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ.. భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. ఫలితంగా నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ ఫిల్మ్. ఇది ఈ రేంజ్‌లో హిట్ అవడంతో దీనికి సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ తీయాలని అప్పుడే అనుకున్నారు. ఇందుకోసం 'బంగార్రాజు' అనే టైటిల్‌తో స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించారు. కానీ అది అలాగే ఉండిపోయింది.

'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీనికితోడు దీన్ని పక్కన పెట్టి కల్యాణ్.. నాగ చైతన్యతో ఓ సినిమాను కూడా చేశాడు. దీంతో ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో 'వైల్డ్ డాగ్' మూవీ సక్సెస్ మీట్‌లో 'బంగార్రాజు' త్వరలోనే ప్రారంభం అవుతుందని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

 Akkineni Nagarjuna and Naga Chaitanya Starrer Bangarraju Shooting Started

అక్కినేని నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే 'బంగార్రాజు' సినిమాను ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరిపారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలోనే సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు కల్యాణ్ కృష్ణతో పాటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.

అక్కినేని నాగార్జున లీడ్‌ రోల్‌లో రాబోయే 'బంగార్రాజు' సినిమాలో ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో అతడి పాత్ర కొద్ది సేపే ఉంటుందని, అయినా ఇది ఎంతో ప్రాధాన్యత ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నాగ చైతన్య.. నాగార్జునకు తండ్రిగా నటిస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో చైతూ పాత్ర కొద్ది సేపే ఉండదట. ఇది సినిమా మొత్తం ట్రావెల్ చేస్తుందని తెలిసింది. ఒకరకంగా నాగ్ కంటే ఎక్కువే కనిపిస్తుందని ఓ న్యూస్ లీకైంది.

ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. ఇక, ఈ సినిమాలో అక్కినేని నాగార్జునకు జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే, నాగ చైతన్యతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయబోతుంది. ఈ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కీలక పాత్రను పోషిస్తోంది. వీళ్లతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X