For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసిన నాగార్జున: ఆ ఫొటో బయటకు రావడంతో క్లారిటీ

  |

  'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఆ రేంజ్ హిట్‌ను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడాయన. అయితే, అవేమీ ఈ సీనియర్ హీరోకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక, ఇటీవల వచ్చిన 'వైల్డ్ డాగ్' మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్‌ అవలేదు. దీంతో విజయం కోసం నాగార్జున నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు.

  అక్కినేని నాగార్జున కొద్ది రోజుల క్రితం విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాను ప్రారంభించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా పున: ప్రారంభం అయినా.. ఇది మాత్రం పట్టాలెక్కలేదు. దీంతో ప్రవీణ్ సత్తారు.. నాగార్జున సినిమా ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, వాళ్లిద్దరి మధ్య స్క్రిప్ట్, క్రియేటివిటీ విషయాల్లో విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇది మళ్లీ మొదలవదు అనుకున్నారంతా.

  Akkineni Nagarjuna and Praveen Sattaru Movie Resumed

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు సినిమా తాజాగా పున: ప్రారంభం అయింది. బుధవారమే ఈ చిత్రాన్ని మరోసారి పట్టాలెక్కించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో హీరో, డైరెక్టర్ షూటింగ్ స్పాట్‌లో ఉన్నప్పటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలకు పుల్‌స్టాప్ పడినట్లు అయింది. ఇక, ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత దీనికి బ్రేకిచ్చి 'బంగార్రాజు' షూట్‌ను మొదలెట్టనున్నాడట నాగ్.

  ప్రవీణ్ సత్తారు సినిమాలో హాలీవుడ్ రేంజ్ ఫైటింగ్, ఛేజింగ్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారట. ఇందుకోసం కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట. ఇందుకోసం ఓ నిపుణుడి దగ్గర కొద్ది రోజులుగా ఆయన నిర్విరామంగా మెళకువలు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఏజ్ బారైనా ఆయన సినిమా కోసం చేస్తున్న రిస్క్ గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌లను నిర్మించారు. విదేవీ షెడ్యూల్‌ను రద్దు చేసి మరీ ఇక్కడ చిత్రీకరణ జరుపుతున్నారు.

  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. This Movie Shooting Remused Today. Nag Joins The Shoot Pic Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X