సంక్రాంతి గోలలో బంగార్రాజు మొండిపట్టు.. స్పెస్ లేకపోయినా కొత్త డేట్ ఫిక్స్!

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అంతకు ముందు వరకు నాగార్జున
50 కోట్ల మార్కెట్ ను అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో ఆ రికార్డును చాలా తొందరగానే అందుకోవడంతో ఒక్కసారిగా మార్కెట్ స్థాయి పెరిగిపోయింది. అయితే నాగార్జున అదృష్టం ఏమిటో గాని మళ్లీ ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ కూడా చూడలేక పోయాడు. ఊపిరి సినిమా పర్వాలేదు అనిపించింది కానీ అనుకున్నంత స్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద లాభాలను అందించలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఓం నమో వెంకటేశాయ, రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాసు మన్మధుడు 2 సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.

ఇక కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ ఓటీటీలో మాత్రం ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. ఇక నాగార్జున ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బంగార్రాజు సినిమా పైనే పెట్టాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సెంటిమెంట్ తోనే సక్సెస్ అందుకోవాలని నాగార్జున ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. 2022 సంక్రాంతికి పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నాగార్జున అదే సమయంలో బంగార్రాజు సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగచైతన్య కూడా ఆ సినిమాలో బంగార్రాజు స్టైల్లోనే కనిపించబోతున్నాడు.

Akkineni nagarjuna bangarraju movie new release date fix

ఇటీవల పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అతను బంగార్రాజు యువకుడిగా ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా నాగచైతన్య కెరీర్ కు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుందని అంటున్నారు. ఇక సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒక డేట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఇటీవల చిత్ర యూనిట్ జనవరి 15వ తేదీ అయితే బెస్ట్ అని ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా కంటే ముందు జనవరి 13న భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. జనవరి 14న రాధేశ్యామ్ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక 15వ తేదీన బంగార్రాజు సినిమాను విడుదల చేయబోతున్నారు. ఒక విధంగా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అయినప్పటికీ కూడా నాగార్జున ధైర్యం చేసి విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ లోకి వస్తారని నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీర్తి సురేష్ మేయిన్ హీరోయిన్స్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X