కొత్త సినిమా విషయంలో నాగ్ కీలక నిర్ణయం: అటు వెళ్లకుండానే పూర్తి చేసేలా ప్లాన్

కొంత కాలంగా విజయాన్ని అందుకోవడంలో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. అవన్నీ ఆయనకు నిరాశనే మిగుల్చుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 'వైల్డ్ డాగ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంతో అంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా ఇది కూడా నష్టాలనే ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో నాగ్.. మరో చిత్రాన్ని ప్రారంభించాడు. తాజాగా దీని గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి విభిన్న చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఫారెన్ షెడ్యూళ్లను క్యాన్సిల్ చేశాడట నాగార్జున. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోలో అదే తరహా సెట్స్ కూడా వేయిస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Akkineni Nagarjuna Cancel Foreign Schedule for Praveen Sattaru Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున వైవిధ్యమైన పాత్రను చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X