Akkineni Nagarjuna: వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ.. ఆ వార్తలపై నాగార్జున క్లారిటీ!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇటీవల అనేక రకాల వార్తలు అయితే వెలువడ్డాయి. అంతేకాకుండా కొంతమంది నటీమణులు సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కూడా వచ్చే ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు కూడా ఇటీవల ఒక టాక్ వినిపించింది.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఆఫర్ కూడా వచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇక వైఎస్ఆర్సిపీ నాగార్జునను విజయవాడ ఎంపీగా ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో ఆ విషయం దాదాపు చాలామంది నిజం అని అనుకున్నారు. ఎందుకంటే ఆ వార్తలు ఎన్ని వచ్చినా కూడా నాగార్జున వెంటనే అయితే క్లారిటీ ఇవ్వలేకపోయారు.

ఇక ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అన్నారు. అలాగే గతంలో కూడా చాలా సార్లు తనపై ఇలాంటి వార్తలు వచ్చాయి అని పూర్తిగా తాను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నట్లుగా వివరణ ఇచ్చారు.
అయితే పొలిటికల్ నేపథ్యంలో ఏదైనా కథ వస్తే మాత్రం అందులో రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు ఒప్పుకుంటాను అని నాగార్జున సరదాగా వివరణ ఇచ్చారు. ఇక యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోటీగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల అవుతున్నప్పటికీ కూడా ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మొత్తానికి విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద నాగార్జున ఏలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











