మరో యంగ్ హీరోయిన్‌తో నాగార్జున.. ఈ వయసులో కూడా నవ మన్మథుడిలా!
తెలుగు చిత్రసీమలో ఏ రకమైన పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే హీరో ఎవరంటే.. కింగ్ నాగార్జున పేరే చెప్పుకోవచ్చు. హీరోయిన్లతో రొమాన్స్ మొదలుకొని భక్త రామదాసు వరకు ఎలాంటి రోల్ లో అయినా సెట్ అవుతారు నాగార్జున. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న ఈయన నేటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఎవర్ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు వరుస పెట్టి యంగ్ హీరోయిన్స్ తో సినిమాలు చేసేందుకు కమిట్ అవుతున్నారు.
మరోవైపు యంగ్ హీరోయిన్స్ సైతం నాగార్జునతో జత కట్టేందుకు రెడీ రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున తాజా సినిమా మన్మథుడు 2 లో రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జునతో రొమాన్స్ చేస్తోంది. చిత్రంలో మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు చిత్రానికి సీక్వల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ ఇందులో నాగ్ రొమాంటిక్ సెన్స్ ఎలా ఉంటుందో తెలియజేశాయి.

ఇదిలా ఉండగానే నాగార్జున సరసన మరో యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. మన్మథుడు 2 ఫినిష్ కాగానే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న బంగార్రాజు సినిమాలో నటించనున్నారు నాగార్జున. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వల్ ఈ మూవీ. ఈ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో నాగ్ సరసన యంగ్ హీరోయిన్ ఉండాలని భావించిన చిత్రయూనిట్ పూజాహెగ్డేని సెలెక్ట్ చేసిందని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











