Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బంగార్రాజు’ విషయంలో నాగార్జున కీలక నిర్ణయం: తగ్గేదేలేదంటున్నాడట
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. కెరీర్ ఆరంభం నుంచే ఈ పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. ఏకధాటిగా వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక, చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న నాగ్.. వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. కానీ, అవేమీ అతడికి విజయాన్ని అందించలేకపోయాయి. ఇలాంటి సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'ఫై ఈ అక్కినేని హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నాడు.
కింగ్ అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ తీయాలని నాగ్, కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే 'బంగార్రాజు' అనే ప్రాజెక్టుపై వర్క్ మొదలు పెట్టారు. ఎంతో గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చే జూలై నుంచి ప్రారంభం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు కరోనా ప్రభావం బాగా పెరగడంతో అది మారుతుందేమో అని అంతా అనుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా 'బంగార్రాజు' మూవీని జూలై నుంచి మొదలు పెడతారని తెలిసింది. ముందుగా ఇండోర్ షూటింగ్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత ఔట్డోర్కు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నాగ్ ఇటీవలే ప్రకటించారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. భూమిక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, అక్కినేని అఖిల్ కూడా ఇందులో నటిస్తున్నాడని అంటున్నారు.