నిన్ను చూసి చాలా రోజులు.. కలువకుండానే వెళ్లిపోయారు.. నాగార్జున ట్వీట్

By Rajababu

Recommended Video

Tollywood Stars Tweets On Nandamuri Harikrishna's Sudden Incident

నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్లు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ కలిసి మెలిసి ఉన్నారు. అదే సంప్రదాయాన్ని హరికృష్ణ, బాలకృష్ణ, నాగార్జున కొనసాగించారు. హరికృష్ణ, నాగార్జున మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. వారిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. తాజాగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నాగార్జున ఉద్వేగానికి గురయ్యాడు. తనను తలచుకొంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

తమ్ముడు.. చాలా రోజులైంది..

తమ్ముడు.. చాలా రోజులైంది..

నాగార్జున, హరికృష్ణ మొన్నీ మధ్య ఫోన్‌లో మాట్లాడుకొన్నారట. ఈ సందర్భంగా తమ్ముడు నిన్ను చూసి చాలా రోజులు అయింది. కలువాలని ఉంది అని చెప్పారట. ఆ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

లోటు పూడ్చలేనిది

కలుద్దామని చెప్పిన హరికృష్ణ గారు కలువకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన లేరు. హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిది. నిన్ను మిస్ అవుతున్నాను అన్న అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

అన్నదమ్ములుగా కలిసి

అన్నదమ్ములుగా కలిసి

హరికృష్ణ, నాగార్జున ఇద్దరూ సీతారాములు చిత్రంలో కలిసి నటించారు. నిజజీవితంలో అన్నదమ్ములా అనే రేంజ్‌లో వారి నటన ఈ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించారు.

తీవ్ర విషాదంలో వైవీఎస్ చౌదరీ

తీవ్ర విషాదంలో వైవీఎస్ చౌదరీ

హరికృష్ణ మృతిపై దర్శకుడు వైవీఎస్ చౌదరీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. హరికృష్ణ మృతితో షాక్ గురైన చౌదరీ.. పొద్దున్నే
నైరాశ్యం, వైరాగ్యం,‘మనసు'తోపాటు ‘శరీరం'లోని అణువుణువు ‘బాధ'పడుతోంది. నా బాధలను ‘తీర్చేవారు' ఒక్కొరొక్కరిగా‘దూరం' అవుతున్నారు.

ఈరోజు..‘తనకు ‘నచ్చితే', అచంచలమైన ‘నమ్మకాన్ని' పెంచుకునే'..నా‘సీతయ్య'..ఇట్లు అంటూ వైవిఎస్‌ చౌదరి ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X