Akkineni Nagarjuna మొదటి పెళ్లి ఫొటో వైరల్.. ఇక్కడ మాత్రం అచ్చం చైతులాగే..
అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే అప్పుడప్పుడు నాగార్జునకు సంబంధించిన కొన్ని వింటేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక పెళ్లి ఫోటో కూడా వైరల్ గా మారిపోయింది. నాగార్జున ఆ పెళ్లి ఫోటోలో పెళ్లి కొడుకుగా పెళ్లి పీటలపై కూర్చున్న విధానం చూస్తూ ఉంటే నాగ చైతన్య గుర్తుకు వస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు.
నాగార్జున అప్పట్లో లవర్ బాయ్ తరహా లోనే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇప్పటికి కూడా మన్మధుడు లాంటి సినిమాలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అయితే నాగార్జున అమలను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఆయన దగ్గుపాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. పెద్దలకు కుదిర్చిన ఆ వివాహం నాగ చైతన్య జన్మించే వరకు కూడా బాగానే కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా కొన్ని కారణాల వలన ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకొని మరొక వారికి నచ్చిన జీవితాన్ని మొదలుపెట్టారు.

అయితే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన మొదటి పెళ్లి ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పెళ్లి పీటలపై నాగార్జున కూర్చున్న విధానం చూస్తూ ఉంటే అచ్చం పెద్దకొడుకు నాగచైతన్య తరహాలోనే ఉన్నట్లు అక్కినేని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక దగ్గుపాటి లక్ష్మి కూడా మరొక వివాహం చేసుకొని చెన్నైలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా కూడా మాట్లాడుకుంటారు.
నాగచైతన్య పెళ్లిలో కూడా దగ్గుపాటి లక్ష్మి పెళ్లి పెద్దగానే వ్యవహరించారు. ఇక నాగచైతన్య ఒకవైపు అక్కినేని వారసుడిగా ఉంటూనే మరొకవైపు దగ్గుపాటి మేనల్లుడిగా కూడా ఎంతో ఆప్యాయంగా పెరిగాడు. అతనికి దగ్గుపాటి సురేష్ బాబు కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. నాగార్జున కూడా నాగచైతన్యతో సినిమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











