రజనీకాంత్‌కు విలన్‌గా నాగార్జున.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తీసింది కేవలం 5 సినిమాలే , కానీ చాలా తక్కువ సమయంలో సౌత్‌లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తారని లోకేష్‌కు పేరు. ఖైదీతో కార్తీకి సాలీడ్ హిట్ ఇచ్చిన ఆయన లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్‌కు విక్రమ్‌తో బూస్టింగ్ ఇచ్చారు.
నటనకు పర్యాయపదం లాంటి కమల్ హాసన్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతుంది. అలాంటి దశలో విక్రమ్ ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తమిళ పరిశ్రమను నిలబెట్టింది. ఆ వెంటనే ఇళయ దళపతి విజయ్‌తో తెరకెక్కించిన లియో సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదట్లో ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా తర్వాత ఎత్తుకుని కలెక్షన్ వర్షం కురిసింది. దీంతో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో తాము కూడా భాగమవుతామని స్టార్లు క్యూ కడుతున్నారు. అలాగే బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. మాకు ఓ సినిమా చేసి పెట్టాలంటూ బడా నిర్మాణ సంస్థలు సూట్ కేసులు పెట్టుకుని లోకేష్ ఇంటి ముందు బారులు తీరుతున్నారు.

కానీ తాను కెరీర్‌లో ఓ పది సినిమాలు మాత్రమే తెరకెక్కిస్తానని, అవి కూడా గుర్తుండిపోయేలా తీస్తానని లోకేష్ గతంలోనే చెప్పారు. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదే కూలీ. ఈ మూవీకి గాను కనకరాజ్ ఏకంగా రూ.60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా కోలీవుడ్ వర్గాల టాక్. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు.
ఎంత కమర్షియల్ సక్సెస్ అనుకున్నా లియో లోకేష్‌ను బాగా డిజప్పాయింట్ చేసింది. దీంతో కూలీ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాస్టింగ్ విషయంలోనూ సీరియస్‌గా ఉంటున్నారు లోకేష్ కనగరాజ్. ఇటీవల కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను కూలీలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తన స్పూర్తి ప్రదాత, తన అభిమాన నటుడు రజనీ సర్‌తో నటించడం ఆనందంగా ఉందని ఉప్పీ తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే రజనీకాంత్, ఉపేంద్ర కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజాగా కూలీ మూవీలో మరో అగ్రనటుడు భాగమయ్యారు. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. ఈరోజు నాగ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఇందులో నాగార్జున సైమన్ అనే రోల్‌లో నటిస్తారని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ క్యారెక్టర్ ఏకంగా రజనీకాంత్‌ను ఢీకొట్టేలా ఉంటుందని , ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని కోలీవుడ్ టాక్. కాగా.. కూలీ రిలీజ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు . వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.


Click it and Unblock the Notifications











