Akkineni Nagarjuna : నాగచైతన్యకు సీక్రెట్ అఫైర్ .. నిఘా పెట్టిన నాగ్!
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోయే అక్కినేని ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్, హైడ్రా.. నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం దుమారం రేపింది. ఇటీవల నాగచైతన్య - సమంతల విడాకులను ఉద్ధేశిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై కోర్టుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో నాగచైతన్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత నుంచి విడాకులు తీసుకున్నాక ఒంటరిగానే ఉంటున్న నాగచైతన్య.. సడెన్‌గా బాంబు పేల్చారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. శోభితతో చైతూ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో మీడియాలో కోడై కూస్తున్నా అంతా లైట్ తీసుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ తన తన కొత్త లైఫ్ పార్టనర్ వేలికి ఉంగరం తొడిగారు చైతన్య. ఆ తర్వాత కొద్దిరోజులకి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేయడం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిలింనగర్‌లో చర్చించుకుంటూ ఉంటారు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చీ రాగానే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం ప్రకంపనలు సృష్టించింది.
హైడ్రా దూకుడుపై నాగార్జున కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు.
నెమ్మదిగా ఈ వివాదాలు సద్దుమణుగుతూ ఉండటం, నాగార్జున బిగ్‌బాస్ , సినిమా వ్యవహారాల్లో బిజీ అవుతున్న సమయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీకి తెరదీశారు. నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆరే కారణమంటూ ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నాగార్జున ఏకంగా మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ పరువు , ప్రతిష్టలను దెబ్బతీసేలా మాట్లాడిన కొండా సురేఖపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జున న్యాయస్థానాన్ని కోరారు.
నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి నాగార్జున మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల క్రితం ఒకప్పటి అగ్ర కథనాయిక జయప్రద.. జయప్రదం పేరుతో ఓ టాక్ షో నిర్వహించారు. ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆమె.. ఓ రోజున నాగార్జునను ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైతన్యకు సంబంధించి ఓ సీక్రెట్ ప్రేక్షకులతో పంచుకోవాలని జయప్రద అడుగుతారు.
దీనికి నాగ్ ఆన్సర్ ఇస్తూ.. వాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని తనకు అనుమానంగా ఉందని, ఆరు నెలల నుంచి ఈ సంగతి తేల్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. దీని గురించి అడిగితే వాడు ఏం చెప్పడం లేదు.. వాచ్‌మెన్‌ని అడితగితే తనకేం తెలియదని అంటున్నాడని నాగ్ అన్నారు. నిలదీసేసరికి నేను వేరే ఇంటికి వెళ్లి అక్కడే ఉంటానని బెదిరిస్తున్నాడని నాగార్జున చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదంతా పదేళ్ల క్రితం నాటి సంగతి కావడంతో బహుశా నాగచైతన్య సీక్రెట్ లవర్ సమంత అయ్యుండొచ్చనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











