HBD Nagarjuna: నాగార్జున ఆస్తుల లెక్కలు ఇవే.. ఇండియాలోనే ఏకైక హీరోగా రికార్డు.. ఈ నిజాలు మీకు తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బడా హీరో.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. యంగ్ ఏజ్ నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తా చూపిస్తున్నారు. నాగార్జున నేడు పుట్టినరోజును జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!

చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా
అక్కినేని నాగార్జున రెండేళ్ల వసులోనే 'వెలుగు నీడలు' అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత 'సుడిగుండాలు' అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే 1986లో 'విక్రమ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున.. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారారు. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు.

Akkineni Nagarjuna Net Worth and Remuneration Details

ట్రెండ్ సెట్ చేసే మూవీల్లో

నాగార్జున వరుస పెట్టి సినిమాలు చేయడంతో పాటు విజయాలను కూడా అందుకున్నా.. అక్కినేని అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి సమయంలోనే 'శివ'తో వచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. లవర్ బాయ్‌గా నటించిన ఈ స్టార్ హీరోనే సాయి బాబాలా, శ్రీరామదాసులానూ కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Akkineni Nagarjuna Net Worth and Remuneration Details

నిర్మాతగా జాతీయ అవార్డ్
అక్కినేని నాగార్జున 1979లోనే 'కల్యాణీ' అనే మూవీతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందులో తన సినిమాలతో పాటు తండ్రి ఏఎన్నార్ చిత్రాలు, ఇతర హీరోలు చేసిన మూవీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 'నిన్నే పెళ్లాడతా' చిత్రానికి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు.

Akkineni Nagarjuna Net Worth and Remuneration Details

బుల్లితెరపై రికార్డులతోనే

సినిమాల్లో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న నాగార్జున.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో ఆయన హోస్టుగా పరిచయం అయిన ఆయన.. అందులో అదరగొట్టేశారు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'ను కూడా హోస్ట్ చేశారు. దీనితో నాగార్జున నేషనల్ రికార్డులను సైతం బ్రేక్ చేశారు.

చాలా వ్యాపారాలతో బిజీ
కింగ్ నాగార్జున సినిమాలకు మాత్రమే పరిమితం అవలేదు. ఆ మధ్య ఓ ఛానెల్‌కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఇందులో బాడ్మింటన్ లీగ్, ఫుల్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు ఓనర్‌గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ పక్కా బిజినెస్‌మ్యాన్ అనిపించుకుంటున్నారు.

Akkineni Nagarjuna Net Worth and Remuneration Details

ఆస్తులు, రెమ్యూనరేషన్

నాగార్జునకు దాదాపు రూ. 3500 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ టాక్ ఉంది. అలాగే, దాదాపు 1000 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ రూ. 200 - 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు, నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు, బిగ్ బాస్ షోకు రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

నటుడిగా, నిర్మాతగా, హోస్టుగా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నవ మన్మథుడు అక్కినేని నాగార్జునకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X