65 ఏళ్లలోనూ యంగ్ గా.. నాగార్జున డైట్ ఇదే.. ఫుడ్ కాస్ట్ నెలకు ఎన్ని లక్షలంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు, కింగ్, అక్కినేని నాగార్జున ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను హీరోగా అలరిస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఫ్యామిలీ కంటెంట్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నారు. మరోవైపు బుల్లితెర పైన కూడా అక్కినేని నాగార్జున ఎంత డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నారో తెలిసిందే. పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ గత 5 సీజన్లుగా తన సత్తా చాటుతున్నారు. ప్రతి సీజన్లో తన డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉన్నారు.
అయితే అక్కినేని నాగార్జున గురించి మాట్లాడితే ముందుగా ఆయన ఫిట్నెస్ గురించే మాట్లాడాలి. ఎందుకంటే 65 ఏళ్లు దాటిన యంగ్ లుక్కు తోనే నాగర్జున అట్రాక్ట్ చేస్తుండడం విశేషం. ఆరు పదుల వయసు దాటినా యవ్వనంగానే ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది. ఇప్పటికీ ట్రెండ్ కు తగ్గట్టుగా తన లుక్ ను మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఏజ్ కనపడకుండా అందరిని ఆకట్టుకుంటున్నారు. ఆయన తోటి నటీనటులంతా ఓల్డ్ గా మారిపోతుంటే నాగార్జున మాత్రం మరింత కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

యంగ్ లుక్కుతోనే షాక్ ఇస్తున్నారు. చివరిగా నాగార్జున తన కొడుకు అక్కినేని నాగచైతన్య బ్లాక్ బస్టర్ ఫిలిం తండేల్ సక్సెస్ మీట్ లో కనిపించారు. కొడుకు చైతన్యతో పోటీపడేలా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. అంతే కాదు ఎలాంటి ఈవెంట్లకు హాజరైనప్పటికీ నాగార్జున తన స్టైలిష్ లుక్కుతో అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వయసులో కూడా ఇంత యంగ్ లుక్ ను ఎలా సాధ్యం చేశారంటూ నాగార్జునకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీలైనంతవరకు ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ను చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే నాగార్జున ప్రతిరోజు స్పెషల్ డైటింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తన బాడీకి తగిన విధంగా ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. దానికోసం స్పెషల్ చెఫ్స్ ను కూడా నియమించుకున్నారు. ఇక తన 30వ ఏట నుంచే నాగార్జున ఒక స్పెషల్ డైట్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ప్రతిరోజు ఉదయం లైట్ ఫుడ్స్ తీసుకుంటారని చెప్పారు. ఇక మధ్యాహ్నం మోతాదులో భోజనం చేస్తారట. రాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 7:30 లోపు డిన్నర్ చేసేస్తారంట. అంతేకాదు నాగార్జున 12:12 లో ఫాస్టింగ్ కూడా చేస్తారంట. 12 గంటలు ఫుడ్ తీసుకుంటే, మిగిలిన 12 గంటలు ఫాస్టింగ్ లో ఉంటారంట.
ఇక తన బాడీకి తగిన విధంగా ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ తగిన మోతాదులో అందేలా చూసుకుంటారంట. అయితే నాగార్జున తీసుకునే ఫుడ్ ఖరీదు ఒక్కరోజు ₹10,000 ఉంటుందట. ఇక నెలకు 3 లక్షల వరకు తన స్పెషల్ డైట్ కోసమే ఖర్చు చేస్తుంటారు అంట. తాజాగా ఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్ళ బెడుతున్నారు. ఒక్కరోజు తన ఫుడ్ కోసం వేళల్లో ఖర్చు అవుతుందా అంటూ నేను విరపోతున్నారు. ఇక స్ట్రిక్ట్ డైట్ ను మైంటైన్ చేయడంతో పాటు ప్రతిరోజు కచ్చితంగా గంట పాటు క్వాలిటీ వర్కౌట్ చేస్తారంట. మిక్స్డ్ వర్కౌట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. మరోవైపు నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న కూలీ చిత్రంలో సీమన్ పాత్రలో అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











