16 ఏళ్ల అమ్మాయితో అక్కినేని నాగార్జున రొమాన్స్: ఇద్దరికీ సెట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్
ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఫిజిక్.. లుక్స్‌తో మాయ చేస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోన్న ఆయన.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన 'వైల్డ్ డాగ్'లో నటించిన ఈ అక్కినేని హీరో.. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌తో 'వీఎస్పీ గరుడ వేగ' వంటి హిట్ తీసిన ప్రవీణ్ సత్తారుతో మూవీని ప్రకటించాడు.
కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఇక, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం ప్రవీణ్ సత్తారే చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

ఇది పట్టాలెక్క ముందే ఇందులో నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన 16 ఏళ్ల అమ్మాయి అనిఖా సురేంద్రన్ నటిస్తోందట. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇక, ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందనున్న 'బంగార్రాజు' కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటినీ ఏక కాలంలో పూర్తి చేయనున్నాడట.


Click it and Unblock the Notifications











