యాపిల్ సంస్థపై నాగార్జున విమర్శలు.. ఆ ప్రొడక్ట్ కొనే ముందు జాగ్రత్త అంటూ ట్వీట్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ, స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారాయన. వరుసగా సినిమాలు చేయడంతో పాటు సినీ పరిశ్రమ కోసం నిరంతరం పాటు పడుతున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అయిన నాగార్జున... పలు వ్యాపారాలనూ చేసి బిజినెస్ మ్యాన్‌గానూ గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి తాజాగా ఓ వ్యాపార సంస్థపై విమర్శలు చేశారు.
అత్యాధునిక సాంకేతికతో ఎన్నో బ్రాండ్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ యాపిల్. తాజాగా దీనిని ఉద్దేశిస్తూ అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో 'ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య వాళ్ల సర్వీసెస్, పాలసీలు వాళ్లకు అనుకూలంగానే క్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు, అవన్నీ చాలా దారుణంగా ఉంటున్నాయి కూడా' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కిస్తోన్న 'వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నారాయన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు, నాగ్ ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సీజన్ తుది దశకు చేరుకుంది. డిసెంబర్ 20 గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీని తర్వాత నాగార్జున.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' అనే ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











