For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్షర గౌడతో రామ్ పోతినేని రొమాన్స్: మరోసారి అదే ఫాలో అవుతోన్న ఉస్తాద్ హీరో

  |

  పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' అనే మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ సినిమాతో సక్సెస్‌నే కాదు.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. దీని తర్వాత అంటే ఈ ఏడాది ఆరంభంలో 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. ఇది కూడా విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా విజయాలను అందుకుంటోన్న అతడు.. ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే మరో సినిమాను కూడా ప్రకటించాడు. తాజాగా దీని గురించి ఓ అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!

  ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేని.. కోలీవుడ్ డైరెక్టర్ లింగు సామీతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తుందట. ఇప్పటికే ఈ ఫిల్మ్‌లో 'ఉప్పెన' భామ కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇప్పుడు అక్షరను కూడా ఈ సినిమాలో భాగం చేసేశారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.

  Akshara Gowda Fix for Ram Pothineni - Lingusamy Movie

  'ఉయార్తిరు 420' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన అక్షర గౌడ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక, కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు 2'లో కూడా అక్షర కీలక పాత్రను చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం బోలెడు చిత్రాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ - లింగుసామీ మూవీకి కూడా ఎంపికైనట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  షర్ట్ బటన్స్ తీసేసి సెగలు రేపుతోన్న ఈషా రెబ్బా: తెలుగమ్మాయిని ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

  ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ యాక్షన్ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఇక, ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Tollywood Star Hero Ram Pothineni Now Doing a Film Under Kollywood Director Lingusamy Direction. Akshara Gowda to play Key Role in This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X