twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వామ్మో చీరకట్టు... లేడీస్ మీకు దండాలు.. చీర కష్టాలను చెప్పిన అక్షయ్

    |

    లక్ష్మీబాంబ్ చిత్రంపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. తాము ఏ కమ్యూనిటీ మనోభావాలను కించపరిచే విధంగా సినిమాను రూపొందించలేదని క్లారిటీ ఇచ్చారు. గత మూడు దశాబ్దాల కెరీర్‌లో తాను ఇలాంటి పాత్రను ఇప్పటి వరకు పోషించలేదు. ఈ చిత్రంలోని ట్రాన్స్‌జెండర్ పాత్రను మానసిక పరిపక్వతతో పోషించాను అని అక్షయ్ కుమార్ తెలిపారు. కరోనా కారణంగా ఈ సినిమాను డిస్నీ+హాట్ స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. లక్ష్మీబాంబ్ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీపై రిలీజ్ కానున్న సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ...

    ఎప్పటి నుంచో చేయాలని ప్రయత్నించా

    ఎప్పటి నుంచో చేయాలని ప్రయత్నించా

    లక్ష్మీబాంబ్ చిత్రంలోని పాత్ర నాలో కొత్త నటుడిని ఆవిష్కరించింది అని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ సినిమా కథ గురించి విన్నాను. అప్పటి నుంచే చేయాలని ప్రయత్నించాను. అయితే ఏవో కారణాల వల్ల సినిమా సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. చాలా నిజాయితీగా ఎవరినీ నొప్పించకుండా చేసిన చిత్రం. అత్యంత ఉత్సాహంతో నేను చేసిన సినిమా ఇది అని అన్నారు.

    150 సినిమాల తర్వాత కూడా

    150 సినిమాల తర్వాత కూడా

    నా కెరీర్‌లో 150 చిత్రాలు చేసిన తర్వాత కూడా ఈ సినిమా నాలో కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. ఈ సినిమా షూటింగు సమయంలో ప్రతీ రోజు ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. లింగ సమానత్వం విషయంలో చాలా అంశాలు నా దృష్టికి వచ్చాయి అని అక్షయ్ కుమార్ అన్నారు. లక్ష్మీ బాంబ్ సినిమా షూటింగులో చాలా విషయాలను నేర్చుకొన్నాను అని అక్షయ్ కుామర్ తెలిపారు.

    చీరకట్టు ఎంతో హుందాతనాన్ని ఇచ్చేది

    చీరకట్టు ఎంతో హుందాతనాన్ని ఇచ్చేది

    లక్ష్మీబాంబ్‌లో చీరకట్టులో నటించడంపై తన స్పందనను అక్షయ్ కుమార్ వ్యక్తం చేస్తూ.. ప్రపంచంలోనే ఎంతో హుందాతనాన్ని ఇచ్చేది చీరకట్టు. ఈ సినిమా షూటింగులో చీర కట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాను. చీరకట్టు కోవడం నా జీవితంలో కొత్త అనుభూతి. చీరకట్టుకొని పనులు చేయడం చాలా కష్టంగా అనిపించింది. నేను చీరకట్టులో నడవడానికే ఇబ్బందిపడ్డాను. కానీ మహిళలు చీరకట్టులో కూడా ఎంతో సౌలభ్యంగా పనులు చేయడం వారి సహనానికి నిదర్శనం. వారికి నా హ్యాట్సాఫ్. వారిపై గౌరవం పెరిగింది అని అక్షయ్ కుమార్ అన్నారు.

    లారెన్స్ రాఘవ దర్శకత్వంలోనే...

    లారెన్స్ రాఘవ దర్శకత్వంలోనే...

    2011లో తమిళంలో విడుదలైన కాంచన చిత్రాన్ని రీమేక్‌గా లక్ష్మీబాంబ్ అనే చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో దర్శకత్వం వహించిన కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవనే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన నిర్మాతలు తుషార్ కపూర్, షబీనా ఖాన్‌కు నా ధన్యవాదాలు అని అక్షయ్ కుమార్ చెప్పారు.

    English summary
    Bollywood superstat Akshay Kumar reveals interesting things about Laxmmi Bomb making. Akshay said that, He learnt so many things in this movie shooting after acting 150 movies in his career. Most difficult part in the movie is wearing a sari. He has saluted to women for wearing sari and doing jobs with very easy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X