twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2015 కేసు.... సిట్ విచారణకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

    |

    బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను బుధవారం పంజాబ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు అక్షయ్ చంఢీగర్ బయల్దేరి వెళ్లారు. డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్ రహీం సింగ్‌, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్‌ సింగ్‌ బాదల్‌ మధ్య జరిగిన ఓ డీల్‌లో అక్షయ్ మధ్యవర్తిత్వం వహించినట్లు ఆరోపణల ఉన్నాయి.

    ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారిస్తోంది. ఈ మేరకు అక్షయ్‌కు సమన్లు అందడంతో ఆయన చంఢీగర్ వెళ్లారు. ఈ విచారణలో పంజాబ్ పోలీసులు తనపై వచ్చిన ఆరోపణలపై అక్షయ్ కుమార్‌ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.

    Akshay Kumar appears before SIT in Chandigarh

    కాగా...ఈ ఆరోపణలను అక్షయ్ కుమార్ ఇప్పటికే ఖండించారు. వారి మధ్య ఎలాంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదని, ఎలాంటి బ్రోకరేజ్ డీల్‌లోనూ తాను ఇన్వాల్వ్ కాలేదని స్పష్టం చేశారు.

    గుర్మీత్‌ రామ్ రహీం సింగ్‌ నటించిన 'మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌' సినిమాను 2015లోలో విడుదలైంది. ఆ సమయంలో సినిమా విడుదలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో గొడవలు జరిగాయి. అపుడు ఫరీద్‌కోట్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

    అయతే సినిమా విడుదలయ్యేలా గుర్మీత్‌ సింగ్‌, బాదల్‌ల మధ్య అక్షయ్‌ కుమార్‌ రూ. 100 కోట్ల డీల్ సెట్ చేశారని, అక్షయ్‌ నివాసంలోనే వీరిద్దరి భేటీ జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ విచారణ జరుగుతోంది.

    English summary
    Bollywood actor Akshay Kumar on Wednesday appeared before a special investigation team (SIT) of the Punjab Police which is investigating the incidents of sacrilege of the Guru Granth Sahib and the subsequent firing on protesters in 2015. Kumar will be questioned regarding his alleged role in brokering a deal between the controversial godman, who was later convicted of rape and sentenced to 20 years' imprisonment and Sukhbir Badal in Mumbai in 2015 just days before the release of a film of the godman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X